కెఎల్ రాహుల్‌కు షాకిచ్చిన క్లోజ్ ఫ్రెండ్.. రోహిత్ గైర్హాజరీలో అతడికి ఛాన్స్ ఇవ్వనన్న పాండ్యా

Published : Mar 17, 2023, 12:13 PM IST

IND vs AUS 1st ODI: భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  నేడు  తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో  ఓపెనర్ గా ఎవరు వస్తారనేదానిపై  కెప్టెన్ హార్ధిక్ పాండ్యా   ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
16
కెఎల్ రాహుల్‌కు షాకిచ్చిన క్లోజ్ ఫ్రెండ్..  రోహిత్ గైర్హాజరీలో అతడికి ఛాన్స్ ఇవ్వనన్న పాండ్యా

టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో  జట్టులోకి వచ్చారు.  ఆ మధ్య కరణ్ జోహార్ షో లో మహిళలపై  చేసిన వ్యాఖ్యలకు గాను ఈ ఇద్దరూ  తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. అయితే   జాన్ జిగ్రీ దోస్తు అయినా  హార్ధిక్ పాండ్యా మాత్రం రాహుల్ కోసం  ప్రత్యేకంగా మెహర్బానీ చేయనని స్పష్టం చేశాడు.

26

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ గైర్హాజరీలో  కెఎల్ రాహుల్ ను శుభ్‌మన్ గిల్ తో కలిసి  ఓపెనింగ్ జోడీగా పంపుతారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై హార్ధిక్ పాండ్యా స్పందించాడు.  రాహుల్ ను ఓపెనర్ గా పంపడం లేదని  పాండ్యా తేల్చి చెప్పాడు. 

36

గిల్ కు  జోడీగా ఇషాక్ కిషన్  ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని  పాండ్యా స్పష్టం చేశాడు.    మ్యాచ్ కు ముందు ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో పాండ్యా మాట్లాడుతూ.. ‘ఇషాన్, గిల్ లు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు.  ఈ వికెట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఏడేండ్లుగా నేను ఈ గ్రౌండ్ (వాంఖెడే) లో  క్రికెట్ ఆడుతున్నా.  

46

ఈ పిచ్ బ్యాట్  తో పాటు బంతికీ అనుకూలంగా ఉంటుంది.  ఇరు జట్లకూ ఇక్కడ అవకాశాలుంటాయి.. మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు..’అని  పాండ్యా చెప్పాడు.  కాగా ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20 లో హార్ధిక్  సారథ్యంలోని భారత జట్టు ఇక్కడ  మ్యాచ్ ఓడింది.  
 

56

ఇక రాహుల్ విషయానికొస్తే.. గత  కొంతకాలంగా పేలవ ఫామ్ తో తడబడుతున్న ఈ వెటరన్ బ్యాటర్.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడిన రెండు టెస్టులలో దారుణంగా విఫలం కావడంతో   ఇండోర్ టెస్టులో  అతడిని తప్పించింది టీమ్ మేనేజ్మెంట్. అహ్మదాబాద్ లో కూడా రాహుల్ బెంచ్  కే పరిమితమయ్యాడు.  ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయి.. టెస్టులలో కూడా నానాటికీ అవకాశాలను దూరం చేసుకుంటున్న రాహుల్.. వన్డేలలో కూడా విఫలమైతే ఇక అతడి కెరీర్ కు చరమగీతమే.  

66

మూడు నెలల క్రితం వరకూ వన్డేలలో రోహిత్ కు జోడిగా రాహుల్  వచ్చేవాడు.  కానీ  అతడి వైఫల్యాలు, గిల్   నిలకడ కారణంగా టీమ్ మేనేజ్మెంట్   సునీల్ శెట్టి అల్లుడిని మిడిలార్డర్ కు పంపింది.  బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపర్  బాధ్యతలూ ఇచ్చింది. మరి ఈ సిరీస్ లో అయినా రాహుల్ రాణిస్తాడేమో చూడాలి. 

click me!

Recommended Stories