రోహిత్, పూజారా, జడ్డూలను అవుట్ చేశా! టీమ్‌కి సెలక్ట్ చేయలేదని టీషర్ట్ విప్పి... హర్డీ సంధు షాకింగ్ కామెంట్స్

First Published | Oct 4, 2023, 5:14 PM IST

డాక్టర్ అవ్వాలనుకుని, యాక్టర్ అయినవాళ్లు చాలామందే ఉంటారు. అయితే క్రికెటర్ అవ్వాలని ఆశపడి, సినీ ఇండస్ట్రీలో సింగర్‌గా సెటిల్ అయ్యాడు హర్వీందర్ సింగ్ సంధు. నటుడిగానూ రాణిస్తున్న హార్డీ సంధు, క్రికెట్ రాజకీయాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..
 

Image: Harrdy Sandhu Instagram

2007 వరకూ ఫాస్ట్ బౌలర్‌గా పంజాబ్ టీమ్‌కి ఆడిన హర్వీందర్ సింగ్ సంధు, సడెన్‌గా క్రికెట్ మానేసి సినిమాల్లోకి వచ్చేశాడు. అసలు క్రికెట్ వదిలేయడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు హార్డీ చెప్పిన సమాధానం, క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేస్తోంది..
 

‘అండర్‌19 వన్డే వరల్డ్ కప్ కోసం శ్రీలంకకి వెళ్లాల్సి ఉంది. 2007లో నేను ఇండియాలో టాప్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా. పూణేలో అండర్19 వరల్డ్ కప్ కోసం క్యాంపు నిర్వహించారు. అప్పుడు టీమ్ కోచ్‌గా వెంకటేశ్ ప్రసాద్ ఉన్నాడు.

Latest Videos


Image: Varinder Chawla

ప్రవీణ్ ఆమ్రే, దిలీప్ వెంగ్‌సర్కార్, ఇంకొకరు ఎవరో ఉన్నారు. పేరు గుర్తులేదు. నేను క్యాంపులో మొదటి మ్యాచ్ ఆడాను. ఆ మ్యాచ్‌లో 3-4 మెయిడిన్ ఓవర్లు వేశా, 5 వికెట్లు తీశాను..

Rohit Sharma

నేను తీసిన వికెట్లలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఛతేశ్వర్ పూజారాని అవుట్ చేశాను. రవీంద్ర జడేజాని అవుట్ చేశాను. అలాగే పినల్ షా, యో మహేష్ అనే ఇద్దరు ప్లేయర్లను అవుట్ చేశాడు. పినల్ షా వికెట్ కీపర్‌, యో మహేష్ తమిళనాడుకి ఆడేవాడు..

అందరూ ఆ మ్యాచ్ తర్వాత నేను కచ్ఛితంగా అండర్19 వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటానని అనుకున్నారు. నేను కూడా ఫిక్స్ అయిపోయా. చూస్తే నాకు టీమ్‌లో ప్లేస్ దక్కలేదు. ఆఖరికి స్టాండ్ బై ప్లేయర్‌గా నన్ను సెలక్ట్ చేయలేదు. 
 

Image: Diljit Dosanjh, Harrdy Sandhu Instagram

నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు అర్థం కాలేదు. కనీసం సబ్‌స్టిట్యూట్‌గా అయినా ఉంటానేమో అని వెతికా. లేకపోవడంతో నా మనసు పగిలిపోయింది. కోపంతో టీ షర్ట్ విప్పి పడేసి, క్రికెట్‌ని వదిలేసి వచ్చేశా..

అప్పుడు క్రికెట్ వదిలేయడం వల్లే ఇక్కడ సింగర్‌గా సక్సెస్ అయ్యానేమో అనిపిస్తూ ఉంటుంది. క్రికెట్‌లో ఉన్న రాజకీయాలకు కచ్ఛితంగా సక్సెస్ అయ్యేవాడిని కాదు. ఎంతోమందిని చూస్తున్నా కదా..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు   హర్వీందర్ సింగ్ సంధు...

click me!