క్రికెట్ ఫ్యాన్స్‌కి షాక్! వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభ వేడుకలు రద్దు... కేవలం 10 జట్ల కెప్టెన్లతో...

First Published | Oct 4, 2023, 1:34 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు ఊహించని షాక్. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది భారత్. దీంతో ఘనంగా ఆరంభ వేడుకలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించింది బీసీసీఐ..
 

బాలీవుడ్ సింగర్ ఆషా భోస్లే, శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్, అర్పిత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, హీరోయిన్ తమన్నా భాటియాలతో ప్రోగ్రామ్స్ జరగబోతున్నట్టు ఫైనలైజ్ కూడా చేశారు. 
 

అయితే తాజాగా అందుతున్న సమచారం ప్రకారం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఆరంభ వేడుకలు నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. దీనికి కారణం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. 
 


అక్టోబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ప్రపంచం ముందు భారత్ పరువు పోవడం ఖాయం. 

South Africa

ఎందుకంటే ఆసియా కప్ 2023 టోర్నీలో కేవలం ఇండియా వర్సెస్ పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్‌ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే పెట్టింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. మిగిలిన దేశాల మ్యాచులకు రిజర్వు డే పెట్టలేదు.

ఈ విధంగా పక్షపాతం చూపించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వరల్డ్ కప్ ఆరంభానికి ముందు వేడుకలు చేయకుండా, 9 రోజుల తర్వాత జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు ఘనంగా వేడుకలు చేస్తే.. మిగిలిన దేశాల క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తారు.
 

ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ టికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయి. ఆన్‌లైన్ యుగంలో టికెట్లను విక్రయించడానికి రకరకాల డ్రామాలు చేస్తోంది బీసీసీఐ. అప్పుడిన్ని, ఇప్పుడిన్ని టికెట్లు రిలీజ్ చేస్తూ, చాలా టికెట్లను క్రికెట్ పెద్దలకు, సెలబ్రిటీలకు, వారి కుటుంబీకులకు చేరవేసినట్టు సమాచారం..
 

ప్రారంభ వేడుకలు చేయకపోయినా నవంబర్ 19న ముగింపు వేడుకలు మాత్రం ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఆరంభ వేడుకలు లేకపోయినా 2023 వన్డే వరల్డ్ కప్ ఆరంభానికి ముందు 10 జట్ల కెప్టెన్లు కలుసుకుని, ఫోటో షూట్‌లో పాల్గొంటారు. 

ఇంకా ప్రారంభ వేడుకలపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ, ఆరంభ వేడుకలు చేయకపోవడానికి కారణం ఏంటనేది తెలీదు.

Latest Videos

click me!