సంజూ శాంసన్ పెయింటింగ్ ముందు టీమిండియా ప్రాక్టీస్... వరల్డ్ కప్ టీమ్‌తోనే ఉన్నానంటూ..

First Published | Oct 4, 2023, 11:16 AM IST

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కి కేరళలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  మ్యాచుల కోసం కేరళకి వెళ్లిన టీమిండియాకి సంజూ శాంసన్, జట్టులో ఎందుకు లేడనే ప్రశ్నే అభిమానుల నుంచి ఎదురయ్యేది. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వార్మప్ మ్యాచ్ ఆడేందుకు తిరువనంతపురానికి వెళ్లింది భారత జట్టు...
 

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సంజూ శాంసన్ పెయింటింగ్ ఉంటుంది. ఈ పెయింటింగ్ ముందే భారత జట్టు నెట్ ప్రాక్టీస్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సంజూ శాంసన్ కూడా ఈ ఫోటోలపై స్పందించిన తీరు, అందర్నీ ఆకట్టుకుంటోంది..
 

‘టీమిండియాతో ఉన్నా... @దేవుడి సొంత దేశంలో’ అంటూ కామెంట్ చేశాడు సంజూ శాంసన్. సెలక్టర్లు పట్టించుకోకపోయినా, టీమ్ మేనేజ్‌మెంట్ అస్సలు లెక్కచేయకపోయినా సంజూ శాంసన్, ఇంత పాజిటివ్‌గా ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Latest Videos


Sanju Samson-Chahal

ఈ యాటిట్యూడ్, సంజూకి మరింత ఫాలోయింగ్ తెచ్చిపెడుతోంది.. వన్డేల్లో సంజూ శాంసన్‌కి 55కి పైగా సగటు ఉంది. అయితే టీ20ల్లో సరిగ్గా ఆడడం లేదనే ఉద్దేశంతో సంజూ శాంసన్‌‌ని వన్డే వరల్డ్ కప్ నుంచి పక్కన బెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్.

Now whats next for Sanju Samson

వన్డేల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో బాగా ఆడుతున్నాడనే కారణంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది..

Sanju Samson

గౌహతిలో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షంతో రద్దు అయ్యింది. నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ కోసం 3400 కి.మీ.లు ప్రయాణించి, తిరువనంతపురం చేరుకుంది భారత జట్టు. అయితే వర్షంతో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా టాస్ కూడా వేయకుండానే రద్దు అయ్యింది..

అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. భారత జట్టు, అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘాన్‌తో, అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు.. 

click me!