ఆస్ట్రేలియా టీమ్‌లో సింగపూర్ సిన్నోడు... టీమిండియాతో టీ20 సిరీస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా టిమ్ డేవిడ్‌...

First Published Sep 18, 2022, 3:02 PM IST

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో స్టార్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించని ముంబై ఇండియన్స్ జట్టు, టిమ్ డేవిడ్ కోసం రూ.8.25 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లకు కొన్న ముంబై ఇండియన్స్, అంతకుమించి చెల్లించి టిమ్ డేవిడ్‌ని కొనుగోలు చేయడంతో అప్పట్లో ఈ సింగపూర్ చిన్నోడి గురించి చాలా పెద్ద చర్చే జరిగింది...

Tim David-RCB Mumbai Jersy

సింగపూర్‌లో జన్మించిన టిమ్ డేవిడ్, 2019లో తన సొంత దేశం తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. 2019లో ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన టిమ్ డేవిడ్, ఇప్పటికే 14 టీ20 మ్యాచులు ఆడాడు... అయితే లీగ్ క్రికెట్‌లో టిమ్ డేవిడ్ చూపించిన పర్పామెన్స్‌కి ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్స్ కూడా ఫిదా అయిపోయాయి...

సింగపూర్ తరుపున 14 టీ20 మ్యాచుల్లో 46.50 సగటుతో 558 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, 4 హాఫ్ సెంచరీలు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 5 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో 122 మ్యాచులు ఆడిన టిమ్ డేవిడ్, ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలతో 2640 పరుగులు చేశాడు...

బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్, హోబర్ట్ హర్రీకేన్స్... పాక్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల తరుపున ఆడాడు. కౌంటీల్లో సుర్రే, సథరన్ బ్రేవ్, లాంకాషైర్ టీమ్స్‌కి ఆడిన టిమ్ డేవిడ్... ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఆడాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన టిమ్ డేవిడ్‌ని సరిగ్గా వాడుకోలేకపోయింది ముంబై ఇండియన్స్. మొదటి మూడు మ్యాచుల్లో టిమ్ డేవిడ్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోవడంతో రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత జరిగిన తప్పు గ్రహించిన ముంబై ఇండియన్స్, ఆఖరి 5 మ్యాచుల్లో డేవిడ్‌కి అవకాశం ఇచ్చింది...
 

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఒకే మ్యాచ్ ఆడిన టిమ్ డేవిడ్, 2022 సీజన్‌లో 8 మ్యాచులు ఆడి 37.20 సగటుతో 186 పరుగులు చేశాడు. స్ట్రైయిక్ రేటు 216.28గా ఉంది. సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాకి మారిన టిమ్ డేవిడ్, టీమిండియాతో టీ20 సిరీస్ ద్వారా మరోసారి కొత్త టీమ్ తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడు...

మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ గాయపడి టీమిండియాతో టీ20 సిరీస్‌కి దూరం కావడంతో టిమ్ డేవిడ్‌ని ఇండియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ టిమ్ డేవిడ్‌కి చోటు దక్కింది.
 

టీమిండియాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లతో టీ20 సిరీస్‌లు ఆడుతోంది ఆస్ట్రేలియా. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందే టీమ్ డేవిడ్‌కి ఆస్ట్రేలియా తరుపున 8 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం రానుంది...

click me!