ఓపెనర్‌గా కోహ్లీనా..? అది అర్థంపర్థం లేని వాదన.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

Published : Sep 18, 2022, 02:37 PM IST

Virat Kohli: రాబోయే టీ20 ప్రపంచకప్ లో  టీమిండియా ఓపెనింగ్ జోడీ మీద విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నది.  రోహిత్ శర్మకు తోడుగా ఎవరిని పంపిస్తే బెటరనే దానిపై  చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  

PREV
17
ఓపెనర్‌గా కోహ్లీనా..? అది అర్థంపర్థం లేని వాదన.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న టీ20  ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవలే భారత జట్టును  ప్రకటించింది. అయితే ఆసీస్ లో ఎవరు ఓపెనింగ్ చేయాలి..? రోహిత్ శర్మ భాగస్వామిగా ఫామ్ లో లేని కెఎల్ రాహుల్ స్థానంలో  కోహ్లీని ఆడించాలా..? లేదంటే రిషభ్ పంత్ ను తీసుకొచ్చి కుడి, ఎడమ చేతి వాటం బ్యాటర్లను ఆడిస్తే బాగుంటుందా..? అని చర్చలు జరుగుతున్నాయి. 

27

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తనదైన శైలిలో  స్పందించాడు. ఓపెనర్ గా కోహ్లీని వద్దే వద్దు అని బల్లగుద్ది మరీ చెప్పాడు. అసలు కోహ్లీని ఓపెనర్ గా పంపాలన్న చర్చే అర్థరహితమని  అన్నాడు. రోహిత్ తో రాహుల్ ను పంపిస్తేనే బాగుంటుందని తెలిపాడు. 
 

37
Image credit: Getty

స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ‘గేమ్ ప్లాన్’ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్.. ‘ఇండియాలో  ఏం జరుగుతుందో మీకు తెలుసా..?   ఎవరైనా ఒక ఆటగాడు ఓ రెండు మ్యాచ్ లలో భాగా ఆడితే.. ఫామ్ లో లేని ఆటగాడిని తీసేసి అతడినే ఆడించాలని అంటారు.  

47

కోహ్లీ ఒక్క మ్యాచ్ లో సెంచరీ కొట్టగానే  రాహుల్ ను ఓపెనర్ గా వద్దని  చర్చలు నడుస్తున్నాయి. కానీ టీ20లలో రోహిత్-రాహుల్ లు ఎంత గొప్ప ఓపెనింగ్ జోడీయో  మరిచిపోయారా..? 

57

రోహిత్ తో కోహ్లీ ఓపెనింగ్ చేయాలని  అంటున్నారు. మరి రాహుల్ పరిస్థితేంటి..? ఇలాంటి చర్చల వల్ల అతడి మానసిక స్థైర్యం దెబ్బతింటుంది.  ఒకవేళ  రాహుల్.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో తక్కువ పరుగులకే ఔటైతే  అప్పుడు కూడా కోహ్లీ ఓపెనర్ గా రావాలని చర్చలు మొదలవుతాయి.  ఓపెనింగ్ పొజిషన్ కు టాప్ క్లాస్ బ్యాటర్స్ అవసరం లేదు. అయితే రోహిత్ శర్మ, కోహ్లీ కంటే రాహుల్ సమర్థవంతుడు.   

67

ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇండియా జట్టుగా ఎలా ఆడుతుందనేది..? వ్యక్తిగత  విషయాలు కాసేపు పక్కనబెట్టి టీమిండియా ప్రదర్శన ఎలా ఉండాలనేదానిపై మాట్లాడాలి..’ అని అన్నాడు. 

77

ఆసియా కప్ కు ముందు వరకు ఫామ్ లేమితో సతమతమైన  విరాట్ కోహ్లీ.. ఈ మెగా టోర్నీలో మాత్రం మునపటి ఫామ్ ను అందుకున్నాడు.  టోర్నీలో రెండో అత్యధిక పరుగుల (276)  వీరుడిగా ఉన్నాడు. అఫ్గాన్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా రాహుల్ తో కలిసి బరిలోకి దిగి ఏకంగా  సెంచరీ (122) చేశాడు.   పాకిస్తాన్ తో పాటు ఐర్లాండ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories