వన్డేల్లో శిఖర్ ధావన్, టీ20ల్లో కెఎల్ రాహుల్, టెస్టుల్లో ఛతేశ్వర్ పూజారా... అందరికీ అతనితోనే చిక్కు..

Published : Jul 13, 2023, 07:56 PM IST

సౌతాఫ్రికా టూర్‌ తర్వాత అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఇద్దరూ టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయారు. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన పూజారా, బుల్లెట్ స్పీడ్‌తో టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. కానీ వచ్చిన కొన్ని రోజులకే పూజారాకి మళ్లీ టీమ్‌లో చోటు కరువైంది..

PREV
18
వన్డేల్లో శిఖర్ ధావన్, టీ20ల్లో కెఎల్ రాహుల్, టెస్టుల్లో ఛతేశ్వర్ పూజారా... అందరికీ అతనితోనే చిక్కు..
Cheteshwar Pujara

బంగ్లాదేశ్ పర్యటనలో తన కెరీర్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఛతేశ్వర్ పూజారా, తొలి ఇన్నింగ్స్‌లో 90+ స్కోరు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫెయిల్ అవ్వడంతో మరోసారి అతన్ని పక్కనబెట్టేసింది టీమిండియా...
 

28

టీమ్‌లో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా, దులీప్ ట్రోఫీలో ఆడుతూ ఇప్పటికే ఓ సెంచరీ కూడా కొట్టేశాడు. అయితే అతనికి సెలక్టర్ల నుంచి మరోసారి పిలుపు దక్కడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే మూడో స్థానంలో శుబ్‌మన్ గిల్‌ని సిద్ధం చేస్తోంది టీమిండియా...

38

వన్డేల నుంచి శిఖర్ ధావన్‌ని తప్పించడానికి, టీ20ల నుంచి కెఎల్ రాహుల్‌ని తప్పించడానికి టీమిండియా వాడిన అస్త్రమే శుబ్‌మన్ గిల్. ఈ రెండు ఫార్మాట్లలో గిల్ అస్త్రం బాగానే వర్కవుట్ అయ్యింది... టెస్టుల్లో కెఎల్ రాహుల్‌కి ప్లేస్ పోవడానికి కూడా శుబ్‌మన్ గిల్లే కారణం.. 

48

ఇషాన్ కిషన్, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.. శుబ్‌మన్ గిల్, వరుసగా ఐదు మ్యాచుల్లో ఫెయిల్ అయినా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసేదాకా అతన్ని కొనసాగించింది టీమిండియా...

58

ఇప్పుడు ఛతేశ్వర్ పూజారాని టీమ్ నుంచి తప్పించడానికి, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్‌ని మూడో స్థానంలో ఆడించాలని నిర్ణయం తీసుకుంది టీమిండియా. వన్‌డౌన్‌లో శుబ్‌మన్ గిల్ క్లిక్ అయితే, ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ మెరిస్తే.. ఇక సీనియర్ ఛతేశ్వర్ పూజారా, కెరీర్ ముగిసినట్టే.

68

‘టీమ్ మేనేజ్‌మెంట్‌తో శుబ్‌మన్ గిల్, మూడో స్థానంలో ఆడాలని అనుకున్నట్టు చెప్పాడని తెలిసి ఆశ్చర్యపోయా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే భారత క్రికెట్‌లో ఇలాంటివి సాధారణంగా జరగవు..

78
Image: KL Rahul, Shubman Gill / Instagram

టీమ్ ఏ ప్లేస్‌లో ఆడాలని ఆదేశిస్తే, ప్లేయర్లు ఆ ప్లేస్‌లో ఆడాల్సిందే. యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్ చేస్తుండడం చాలా మంచి విషయం. టెస్టుల్లో ఓపెనింగ్ క్లిష్టమైన పని అయితే వన్‌డౌన్ పొజిషన్ మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుంది..

88
Sgubman Gill

నాలుగో స్థానంలో ఆడే ప్లేయర్‌కి బాగా ఆడేందుకు వెసులుబాటు ఉంటుంది. అందుకే చాలామంది ప్లేయర్లు, ఆ పొజిషన్‌లో ఆడాలని అనుకుంటారు. నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్, టాపార్డర్‌తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్లతోనూ బ్యాటింగ్ చేస్తాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా..

Read more Photos on
click me!

Recommended Stories