కొడుకు ఆడుతున్నాడని కూడా పట్టించుకోలేదు! సచిన్ అవుట్ అవ్వగానే ఛానెల్ మార్చేసి, షారుక్ మూవీ చూస్తూ...

Published : Jul 13, 2023, 06:06 PM IST

టీమిండియా విదేశాల్లో సాధించిన చిరస్మరణీయ విజయాల్లో 2022 నాట్‌వెస్ట్ సిరీస్ ఒకటి. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి, గాల్లో తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ. లార్డ్స్ అనగానే టీమిండియా ఫ్యాన్స్‌కి మొదట గుర్తొచ్చేది ఇదే..

PREV
18
కొడుకు ఆడుతున్నాడని కూడా పట్టించుకోలేదు! సచిన్ అవుట్ అవ్వగానే ఛానెల్ మార్చేసి, షారుక్ మూవీ చూస్తూ...

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగుల భారీ స్కోరు చేసింది. మార్కస్ ట్రెస్కోథిక్ 109 పరుగులు, నాజర్ హుస్సేన్ 115 పరుగులు, ఆండ్రూ ఫ్లింటాఫ్ 40 పరుగులు చేశారు. 325 పరుగుల టార్గెట్ అంటే ఇప్పుడే చాలా పెద్ద విషయం. అప్పట్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమ్, 250+ టార్గెట్ ఉంటే గెలవడమే చాలా కష్టమని అనుకునేవాళ్లు...

28

వీరేంద్ర సెహ్వాగ్ 45, సౌరవ్ గంగూలీ 60 పరుగులు చేయగా దినేశ్ మోంగియా 9, సచిన్ టెండూల్కర్ 14, రాహుల్ ద్రావిడ్ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. సచిన్ వికెట్ పడగానే భారత్‌లో సగానికి పైగా టీవీలు ఆఫ్ అయిపోయాయి. ఇక టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని ఫిక్స్ అయిపోయి,టీవీలు కట్టేసి పడుకున్నారు చాలామంది.

38
Sourav Ganguly

సచిన్ టెండూల్కర్ అవుట్ కాగానే ఛానెల్ మార్చేసి, షారుక్ ఎవర్‌గ్రీన్ ‘దేవ్‌దాస్’ సినిమా చూడడం మొదలెట్టారట భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తల్లిదండ్రులు. ఆ సమయంలో కొడుకుస్వయంగా క్రీజులో ఉన్నా, అతని బ్యాటింగ్ చూడడం కంటే టీమిండియా ఎలాగూ ఓడిపోతుందని డిసైడ్ అయిపోయి... షారుక్ సినిమా చూసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు...

48
natwest

ఈ మ్యాచ్‌కి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి గుర్తులను సోషల్ మీడియాలో పంచుకున్నాడు మహ్మద్ కైఫ్. ‘ఈ మ్యాచ్‌ చూసేందుకు అహ్మదాబాద్‌ వెళ్లి, మా అమ్మానాన్నలను కలిశా. అమ్మ ఏమందంటే.. ఫైనల్ లైవ్ అయితే చూడలేకపోయా, కానీ అల్లా దయ వల్ల టీవీలో ఈ మ్యాచ్‌ని వెయ్యి సార్లు రిప్లై చూశా.. అని. నాన్నకి మాత్రం దాదాని లార్డ్స్‌ బాల్కనీలో అలా చూడడమే చాలా సంతోసం..’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు మహ్మద్ కైఫ్..

58

సచిన్ అవుటైన తర్వాత యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ కలిసి ఆరో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 63 బంతుల్లో 69 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ అవుటైన తర్వాత హర్భజన్ సింగ్ 15 పరుగులు చేయగా అనిల్ కుంబ్లే డకౌట్ అయ్యాడు.

68

ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 2 పరుగులు కావాల్సి రావడంతో జహీర్ ఖాన్, మూడో బంతికి 2 పరుగులు తీయడం... మహ్మద్ కైఫ్‌తో పాటు లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ షర్టు విప్పి సెలబ్రేట్ చేసుకోవడం జరిగిపోయాయి..

78
natwest series final

ఈ మ్యాచ్‌లో 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసిన మహ్మద్ కైఫ్, కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌ ఆడి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 

88

 ‘దీన్ని నాట్‌వెస్ట్ అనే కంటే నాటెస్ట్ అంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఇది చాలా రకాలుగా మమ్మల్ని పరీక్షించింది. మహ్మద్ కైఫ్ లేకపోతే ఈ విజయం దక్కేది కాదు’ అంటూ యువీ, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. 

click me!

Recommended Stories