అనుకున్నది సాధించిన సెలక్టర్లు! సర్ఫరాజ్ ఖాన్‌ని మానసికంగా చంపేసి, ఫామ్‌ కోల్పోయేలా చేసి...

Published : Jul 13, 2023, 06:57 PM IST

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ మొదలైంది. యశస్వి జైస్వాల్, తొలి ఇన్నింగ్స్‌లో మంచి బ్యాటింగ్ టెక్నిక్‌తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ సిరీస్‌కి ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది..

PREV
18
అనుకున్నది సాధించిన సెలక్టర్లు! సర్ఫరాజ్ ఖాన్‌ని మానసికంగా చంపేసి, ఫామ్‌ కోల్పోయేలా చేసి...
Sarfaraz Khan

మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో దుమ్మురేపుతూ వచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీల్లో సర్ఫరాజ్ ఖాన్ సగటు, ది గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మెన్ ఫస్ట్ క్లాస్ సగటుకి దగ్గరలో ఉండేది.

28
Sarfaraz Khan

మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్నా, సెలక్టర్లు పట్టించుకోకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్, మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సమయంలోనే సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కుతుందని అనుకున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే సెలక్టర్లు, అప్పుడు సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇచ్చి సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోలేదు..

38

ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్‌కి కూడా టీమ్‌లో చోటు కల్పించిన సెలక్టర్లు.. రంజీల్లో రికార్డుల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి మరోసారి మొండిచేయి చూపించారు..

48
Sarfaraz Khan

సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ టెక్నిక్, యావరేజ్, స్ట్రైయిక్ రేటు అన్నీ బాగానే ఉన్నా అతని యాటిట్యూడ్ సరిగా లేదని, బీసీసీఐ సెలక్టర్లతో, పెద్దలతో అతను దురుసుగా ప్రవర్తించాడని అందుకే అతన్ని టీమ్‌కి సెలక్ట్ చేయడం లేదని వార్తలు వినిపించాయి..

58
Sarfaraz Khan

మరికొందరు ఓవర్ వెయిట్ ఉండడం వల్లే సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్ట్ పట్టించుకోవడం లేదని, అతను పిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని సూచించారు. యోయో టెస్టులో కూడా పాస్ అవుతున్న సర్ఫరాజ్ ఖాన్, ఫిట్‌నెస్ టెస్టు కూడా క్లియర్ చేశానని ప్రకటించాడు..

68

దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఆడి డకౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్, రెండో ఇన్నింగ్స్‌లో 30 బంతులు ఆడి 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. తాజాగా సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్‌లో 4 బంతులాడి డకౌట్ అయ్యాడు సర్ఫరాజ్ ఖాన్...

78
Sarfaraz Khan

చూస్తుంటే టీమ్‌లో చోటు దక్కకపోవడంతో ప్రతీ మ్యాచ్‌లోనూ నిరూపించుకోవాలనే ప్రెషర్ వల్లనో, లేక ఎంత బాగా ఆడినా ఇక టీమ్‌కి సెలక్ట్ చేయరనే నిరాశభావం మనసులో నిండిపోవడం వల్లనో.. సర్ఫరాజ్ ఖాన్, మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు అర్థమవుతోంది..

88

దులీప్ ట్రోఫీలో వరుసగా ఫెయిల్ అవుతూ ఉండడంతో ఓ రకంగా సెలక్టర్ల ఇగో చల్లారి ఉంటుంది. ఇలా ఫెయిల్ అవుతాడనే ఉద్దేశంతోనే సర్ఫరాజ్ ఖాన్‌ని టీమ్‌కి సెలక్ట్ చేయలేదని చెప్పుకోవడానికి ఓ సాకు దొరికినట్టైంది..  

click me!

Recommended Stories