నా విజయం వెనక యువరాజ్ సింగ్ ఉన్నారు... ఐపీఎల్ ముందు అలా చేయడం వల్లే...

Published : Jan 23, 2021, 02:07 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టి, భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్. ఆఖరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో గిల్ చేసిన 91 పరుగులు, మ్యాచ్ విజయానికి చాలా కీలకమయ్యాయి. అయితే ఆసీస్ టూర్‌లో గిల్ విజయం వెనక మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నాడట...

PREV
113
నా విజయం వెనక యువరాజ్ సింగ్ ఉన్నారు... ఐపీఎల్ ముందు అలా చేయడం వల్లే...

ఆస్ట్రేలియా టూర్‌లో రాణించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్న శుబ్‌మన్ గిల్... అక్కడి పిచ్‌లపై రాణించడానికి యువరాజ్ సింగ్ ఎంతో సాయం చేశారని తెలిపాడు..

213

‘నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది... టీమిండియా తరుపున ఆడడమే చాలా పెద్ద అదృష్టం. అది నాకు దక్కింది. మొదటి టెస్టుకి ముందు కొద్దిగా ఒత్తిడికి గురయ్యాను...

313

కానీ ఒక్కో ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటే, నాలో నమ్మకం పెరుగుతూ పోయింది... నాకు సెంచరీ వచ్చి ఉంటే, కేక్‌లో చెర్రీ దొరికినట్టుగా సంతోషించేవాడిని... 

413

సెంచరీ చేయకపోవడం కాస్త బాధ అనిపించినా... భారత జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది...

513

ఈ సిరీస్ నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి బాగా ఉపయోగపడింది... ఆస్ట్రేలియా టూర్‌కి నా సక్సెస్‌లో యువరాజ్ సింగ్‌కి కూడా పాత్ర ఉంటుంది...

613

ఐపీఎల్ ప్రారంభానికి ముందు యువరాజ్ సింగ్‌తో కలిసి శిక్షణ తీసుకున్నాడు... ఈ క్యాంప్‌లో యువీ నాకు షార్ట్ పిచ్ బంతులు వేసేవారు...

713

నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపున భుజానికి కంటే ఎత్తుగా షార్ట్ పిచ్ బంతులు విసిరేవారు యువరాజ్... వివిధ యాంగిల్స్ బౌలింగ్ చేస్తూ నన్ను బాగా కంఫ్యూజ్ చేశాడు...

813

యువరాజ్ సింగ్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం, షార్ట్ పిచ్ బంతులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను... యువీ ట్రైనింగ్ వల్లే ప్యాట్ కమ్మిన్స్, హజల్‌వుడ్, స్టార్క్ బౌలింగ్‌లోనూ బాగా బ్యాటింగ్ చేయగలిగాను...

913

ఐపీఎల్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కారణంగా ఆరు నెలలపాటు ఇంటికి, ఇంటి ఫుడ్‌కి దూరమయ్యాను. ఇప్పుడు కొన్నాళ్ల పాటు హాయిగా అమ్మ చేతి వంట తింటాను...

1013

ఇప్పుడు నా తర్వాతి లక్ష్యం ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించడమే... ఎందుకంటే ఈ టెస్టు సిరీస్‌లో నేను కొత్త కుర్రాడిని... ఆసీస్ టూర్‌లో చేసిన పరుగులు, లక్కీగా వచ్చినవి కావని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపైన ఉంటుంది...

1113

అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్, కానీ నేను ఈ ఛాలెంజ్‌కి సిద్ధం...’అంటూ చెప్పుకొచ్చాడు శుబ్‌మన్ గిల్...

1213

మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా ఫెయిల్ కావడంతో భారత జట్టులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్... అతి చిన్న వయసులో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

1313

మొత్తంగా మూడు టెస్టుల్లో 51 సగటుతో 259 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... మూడు టెస్టుల్లో రిషబ్ పంత్ (274) తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. 

click me!

Recommended Stories