శుబ్‌మన్ గిల్ ఎంత ఫామ్‌లో ఉన్నా ఉత్తదే... అక్కడ ఎలా ఆడాలో అతనికి తెలీదు! - గ్రెగ్ ఛాపెల్...

Published : Jun 05, 2023, 12:33 PM IST

2023 ఏడాదిలో బీభత్సమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు శుబ్‌మన్ గిల్. అంతర్జాతీయ క్రికెట్‌లో 5 సెంచరీలు, 800+ పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడు సెంచరీలతో 890 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్‌పైన భారీ ఆశలే పెట్టుకుంది టీమిండియా...

PREV
17
శుబ్‌మన్ గిల్ ఎంత ఫామ్‌లో ఉన్నా ఉత్తదే... అక్కడ ఎలా ఆడాలో అతనికి తెలీదు! - గ్రెగ్ ఛాపెల్...
Image credit: PTI

2023 ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అయితే శుబ్‌మన్ గిల్ బ్యాటు నుంచి వచ్చిన ఇన్నింగ్స్‌లన్నీ కూడా స్వదేశంలో వచ్చినవే...

27
Image credit: Getty

‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా కొన్ని చిన్న చిన్న విషయాలను చూసుకుంటే చాలు, ఈజీగా టైటిల్ గెలవచ్చు. శుబ్‌మన్ గిల్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే అతనికి కూడా వీక్‌నెస్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో అతని రికార్డు ఏ మాత్రం బాగోలేదు..
 

37

కరెక్టుగా స్టంప్ లెంగ్త్ బాల్స్ వేసినా, ఎక్స్‌ట్రా బౌన్స్ బంతులు వేసినా శుబ్‌మన్ గిల్ ఈజీగా దొరికిపోతాడు. అతను చాలా మంచి ప్లేయర్, ఆ విషయంలో డౌట్ లేదు. ఫామ్‌లో కూడా ఉన్నాడు కాబట్టి అతన్ని త్వరగా అవుట్ చేస్తే, భారత జట్టుపై ఒత్తిడి పెంచొచ్చు...

47
Image credit: Getty

గత ఇంగ్లాండ్‌ పర్యటనలో శుబ్‌మన్ గిల్ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక్కడి పరిస్థితుల్లో పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తే గిల్ ఫామ్ ఉత్తిదే అయిపోతుంది..
 

57

నాకు తెలిసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఫేస్ చేయడానికి శుబ్‌మన్ గిల్ చాలా ఇబ్బందిపడతాడు. స్టార్క్ సంధించే ఎక్స్‌ట్రా పేస్ ఎలాంటి బ్యాటర్‌ని అయినా అవుట్ చేయగలదు. హజల్‌వుడ్ ఆడకపోయినా బోలాండ్‌ కూడా భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు...
 

67
Image credit: PTI

ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో ఈ ఇద్దరికీ బాగా తెలుసు. ఆస్ట్రేలియా పర్యటనలో శుబ్‌మన్ గిల్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కూడా. 

77

శుబ్‌మన్ గిల్ వయసు 22 ఏళ్లే అయినా అతనికి అంతర్జాతీయ అనుభవం వచ్చేసింది. కాబట్టి అతన్ని కొట్టాలంటే ఇంగ్లాండ్ పరిస్థితులను ఆస్ట్రేలియా బౌలర్లు చక్కగా వాడుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్..

Read more Photos on
click me!