టీమిండియా ఫ్యూచర్ స్టార్ అతనే, అందుకే ఎంపిక చేశాం... సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌కి ఎంపికైన...

Published : Jan 01, 2022, 04:21 PM IST

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌, వెంకటేశ్ అయ్యర్‌కి తొలిసారి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. ఇప్పటికే టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన ఈ ఇద్దరూ, వన్డే ఫార్మాట్‌లోనూ ఆరంగ్రేటం చేయబోతున్నారు...

PREV
110
టీమిండియా ఫ్యూచర్ స్టార్ అతనే, అందుకే ఎంపిక చేశాం... సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌కి ఎంపికైన...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్‌కి, రోహిత్ శర్మ అండ్ టీమ్ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కేవలం రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు రుతురాజ్...

210

విజయ్ హాజారే ట్రోఫీలో ఐదు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ని సఫారీ టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు...

310

శ్రీలంక టూర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన రుతురాజ్ గైక్వాడ్, మొట్టమొదటి సిరీస్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ పర్పామెన్స్ ఇవ్వలేకపోయాడు...

410

‘సరైన సమయంలో అవకాశం ఇవ్వడం చాలా అవసరం. రుతురాజ్ గైక్వాడ్‌కి ఇప్పుడు అలాంటి అవకాశం కావాలి. టీ20 టీమ్‌లో రుతురాజ్ ఎంట్రీ ఇచ్చాడు.

510

ఇప్పుడు వన్డే టీమ్‌లో అవకాశం ఇస్తున్నాం. అతను దేశవాళీ టోర్నీల్లో తన పర్పామెన్స్ ద్వారా టీమ్‌లో ప్లేస్ సంపాదించుకున్నాడు...

610

మా అంచనా ప్రకారం టీమిండియాకి ఫ్యూచర్ స్టార్ అతనే, భవిష్యత్తులో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నాం...

710

మేం రుతురాజ్ గైక్వాడ్‌ను సఫారీ టూర్‌కి ఎంపిక చేశాం. అతన్ని ఆడించాలా? వద్దా? అనేది టీమ్ మేనేజ్‌మెంట్‌ మీద ఆధారపడి ఉంటుంది...

810

రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో రుతురాజ్‌ గైక్వాడ్‌కి అవకాశం దొరకవచ్చని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ...

910

ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన రుతురాజ్ గైక్వాడ్, ఓ అజేయ సెంచరీతో 635 పరుగులు చేశాడు. ఆ తర్వాత విజయ్ హాజారే ట్రోఫీలో 5 మ్యాచుల్లో నాలుగు సెంచరీలతో 603 పరుగులు చేశాడు.

1010

విజయ్ హాజారే ట్రోఫీలో అత్యధికంగా 168 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్... విరాట్ కోహ్లీ, పృథ్వీషా (2020), దేవ్‌దత్ పడిక్కల్ (2020 సీజన్) సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు.

click me!

Recommended Stories