Shubman Gill Net Worth: శుభ్‌మన్ గిల్ నెట్ వర్త్ ఎంత? లగ్జరీ లైఫ్‌స్టైల్, కార్ల కలెక్షన్ తెలిస్తే మైండ్ బ్లాక్

Published : Oct 01, 2026, 11:33 AM IST

Shubman Gill Net Worth: భారత క్రికెట్ స్టార్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్నాడు. ఆర్థికంగానూ దూసుకుపోతున్నాడు. గిల్ నెట్ వర్త్ 2026లో వందల కోట్లు దాటింది. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ జీతం, లగ్జరీ కార్లు, బ్రాండ్ డీల్స్ వివరాలు ఇవే..

PREV
16
కోట్లలో లగ్జరీ ఇల్లు, రేంజ్ రోవర్.. మన ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ సంపాదన ఎంతంటే?

భారత క్రికెట్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న యువ స్టార్‌లలో శుభ్‌మన్ గిల్ ఒకరు. తన స్టైలిష్ బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో మైదానంలో ఆకట్టుకోవడమే కాకుండా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు విజయవంతంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. మైదానంలో ఆటతో పాటు బయట ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ గిల్ రేంజ్ మునుపటి కంటే బాగా పెరిగింది. ప్రెజెంట్ జనరేషన్ క్రికెటర్లలో అత్యధికంగా ఆర్జిస్తున్న ప్లేయర్లలో ఒకరిగా నిలిచారు.

26
రూ. 100 కోట్లు దాటిన గిల్ నెట్ వర్త్

2026 నాటికి శుభ్‌మన్ గిల్ మొత్తం నికర ఆస్తుల విలువ అంచనా ప్రకారం రూ. 95 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్ కెప్టెన్సీ జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్టార్టప్‌లలో పెట్టిన పెట్టుబడులే ఇందుకు ప్రధాన కారణం. గత మూడేళ్లలోనే ఆయన బ్రాండ్ వ్యాల్యూ మూడు రెట్లు పెరిగి, రూ. 130 కోట్లకు చేరింది.

36
బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ నుంచి భారీ ఆదాయం

శుభ్‌మన్ గిల్‌కు భారత క్రికెట్ నియంత్రణ మం‌డలి లో గ్రేడ్ A కాంట్రాక్ట్ ఉంది. దీని ద్వారా ఏటా రూ. 5 కోట్లు ఫిక్స్డ్ రిటైనర్ ఫీజుగా అందుతోంది. దీంతో పాటు ఆడే ప్రతి మ్యాచ్‌కు ప్రత్యేకంగా ఫీజు లభిస్తుంది..

• టెస్ట్ మ్యాచ్: రూ. 15 లక్షలు

• వన్డే మ్యాచ్: రూ. 6 లక్షలు

• టీ20 మ్యాచ్: రూ. 3 లక్షలు

అన్ని ఫార్మాట్లలో క్రమం తప్పకుండా ఆడుతుండటం వల్ల బీసీసీఐ ద్వారానే ఆయనకు ఏటా రూ. 7 నుంచి 8 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక ఐపీఎల్ విషయానికొస్తే, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ను ఒక సీజన్‌కు రూ. 16.50 కోట్లకు ఆ జట్టు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారానే గిల్ దాదాపు రూ. 60 కోట్లకు పైగా సంపాదించారు.

46
గిల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు.. స్టార్టప్‌లు

యువతలో గిల్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా దిగ్గజ బ్రాండ్లు ఆయన వెంటే పడుతున్నాయి. ఏటా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే గిల్ రూ. 20 నుంచి 30 కోట్లు వరకు ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటన లేదా క్యాంపెయిన్‌కు రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్లు వరకు ఛార్జ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయన నైక్, ఎంఆర్‌ఎఫ్, సియట్, సీఆర్ డ్రైవ్, బోట్, కాసియో, జిల్లెట్, మై11సర్కిల్ సహా దాదాపు 18కి పైగా ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. క్రికెట్ అండ్ ప్రకటనలే కాకుండా 'డ్రైవ్ ఫిట్' అనే ఫిట్‌నెస్ చైన్‌ను కో-ఫౌండ్ చేయడంతో పాటు వెంచర్ క్యాపిటల్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెట్టారు.

56
గిల్ ఖరీదైన కార్ల కలెక్షన్

స్పోర్ట్స్ అండ్ లగ్జరీ కార్లంటే గిల్‌కు చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో రూ. కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి..

• మెర్సిడెస్ AMG SL55 రోడ్‌స్టర్: సుమారు రూ. 2.8 కోట్లు

• బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్: సుమారు రూ. 1.7 కోట్లు

• రేంజ్ రోవర్ వేలార్: సుమారు రూ. 90 లక్షలు

• మెర్సిడెస్ బెంజ్ E350: సుమారు రూ. 90 లక్షలు

• మహీంద్రా థార్: సుమారు రూ. 18 లక్షలు

66
గిల్ లగ్జరీ ఇళ్లు.. ఇతర ఆస్తులు ఇవే

పంజాబ్‌‌లోని చండీగఢ్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో అత్యాధునిక జిమ్, ప్రైవేట్ ప్రాక్టీస్ నెట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి ఆయన ఇక్కడే నివసిస్తున్నారు. దీనితో పాటు వాణిజ్య రాజధాని ముంబైలో రూ. 8 నుంచి 10 కోట్ల విలువైన విలాసవంతమైన ప్లాట్ ఉంది. ప్రాక్టీస్ క్యాంప్‌లు, బ్రాండ్ షూట్ల కోసం ముంబైకి వచ్చినప్పుడు గిల్ ఇక్కడే బస చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories