వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 4లోకి శుబ్‌మన్ గిల్... ఆసియా కప్‌ 2023 టోర్నీతో బాబర్ ఆజమ్‌కి చెక్ పెట్టగలడా...

Published : Aug 23, 2023, 07:37 PM IST

టీమిండియా యంగ్‌స్టర్ శుబ్‌మన్ గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 4లోకి ఎగబాకాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ముగ్గురు పాక్ బ్యాటర్లు ఉన్నారు. 880 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టాప్ ప్లేస్‌లో సెటిల్ అయిపోయాడు. 

PREV
16
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 4లోకి శుబ్‌మన్ గిల్... ఆసియా కప్‌ 2023 టోర్నీతో బాబర్ ఆజమ్‌కి చెక్ పెట్టగలడా...

777 పాయింట్లతో సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ డేర్ దుస్సేన్ రెండో స్థానంలో ఉండగా పాక్ యంగ్ ఓపెనర్ ఇమామ్ వుల్ హక్ 752 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శుబ్‌మన్ గిల్ 743 పాయింట్లతో టాప్ 4లో ఉండగా ఫకార్ జమాన్ 740 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు.. 

26
Image credit: Getty

వెస్టిండీస్ టూర్ తర్వాత శుబ్‌మన్ గిల్, వన్డేలు ఆడకపోయినా ఆఫ్ఘాన్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్ బ్యాటర్ ఫకార్ జమాన్ ఫెయిల్ అవ్వడంతో భారత యంగ్ బ్యాటర్‌కి ప్రమోషన్ దక్కింది. ఆసియా కప్ 2023 టోర్నీ, టీమిండియా బ్యాటర్‌కి టాప్ ప్లేస్‌కి వెళ్లే ఛాన్స్ ఇవ్వనుంది..

36
Babar Azam

ఆఫ్ఘాన్‌తో జరిగిన తొలి వన్డేలో బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యాడు. ఆఫ్ఘాన్‌పై బాబర్ ఆజమ్ వీరంగం సృష్టించడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. కాబట్టి  ఆసియా కప్ 2023 టోర్నీలో శుబ్‌మన్ గిల్ ఇచ్చే పర్ఫామెన్స్, టాప్ 5 ర్యాంకింగ్స్‌లో మార్పులు తీసుకురానుంది..

46
Image credit: PTI

శుబ్‌మన్ గిల్ గురి చూసి కొడితే, బాబర్ ఆజమ్ టాప్ ర్యాంకుని కొట్టేందుకు పెద్దగా సమయం కూడా పట్టకపోవచ్చు. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 5 అంతర్జాతీయ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ 2023 తర్వాత తన ఫామ్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే స్వదేశంలో గిల్‌కి ఉన్న రికార్డు దృష్ట్యా... ఫామ్‌లోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు.. 
 

56
Image credit: PTI

వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 9లో ఉన్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 11వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ తిరిగి టాప్‌లోకి వెళ్లడానికి కూడా అవకాశం ఉంది. ఆసియా కప్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో టీమిండియా బ్యాటర్లు చూపించే పర్ఫామెన్స్.. ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపుతుంది...
 

66

జనవరిలో ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న హైదరాబాదీ మియా మహ్మద్ సిరాజ్... గాయంతో వెస్టిండీస్ టూర్‌కి దూరం కావడంతో ఐదో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్ టూర్‌లో చక్కని ప్రదర్శన కనబర్చి, ఆసియా కప్‌కి ఎంపికైన కుల్దీప్ యాదవ్, టాప్ 10లో కొనసాగుతున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories