మెహర్ రమేష్ ఫ్లాప్ సినిమా, షకీబ్ కెప్టెన్సీ, జకోవిచ్, హాకీ.. 2011 వరల్డ్ కప్‌ని రిపీట్ చేస్తూ ఎన్నో... అయినా!

Published : Aug 23, 2023, 06:04 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 12 ఏళ్లకు భారత్‌లో వన్డే ప్రపంచ కప టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్‌కి కౌంట్‌డౌన్ కూడా మొదలైపోయింది. ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవబోతుందని చాలామంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు..  

PREV
111
మెహర్ రమేష్ ఫ్లాప్ సినిమా, షకీబ్ కెప్టెన్సీ, జకోవిచ్, హాకీ.. 2011 వరల్డ్ కప్‌ని రిపీట్ చేస్తూ ఎన్నో... అయినా!

2011లో జరిగిన చాలా విషయాలు, 2023లోనూ రిపీట్ కావడంతో ఈసారి భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ గెలవబోతుందనే సెంటిమెంట్‌‌ని బలంగా నమ్ముతున్నారు కొందరు టీమిండియా ఫ్యాన్స్.. ఒకటి కాదు, రెండూ కాదు... ఏకంగా 2011లో జరిగిన 8 విషయాలు, 2023లోనూ జరిగాయి...

211
England vs Australia

2011లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 280+ పరుగుల లక్ష్యాన్ని నాలుగో ఇన్నింగ్స్ ఛేదించి, 2 వికెట్ల తేడాతో విజయం అందుకుంది ఆస్ట్రేలియా. 2023 యాషెస్ సిరీస్‌లో 280+ టార్గెట్‌ని సరిగ్గా 2 వికెట్ల తేడాతో ఛేదించి ఘన విజయం అందుకుంది ఆస్ట్రేలియా. మధ్యలో 12 ఏళ్లలో ఆసీస్ ఈ ఫీట్‌ని రిపీట్ చేయలేకపోయింది..

311
Image credit: PTI

2011లో చెన్నై సూపర్ కింగ్స్, ఫైనల్‌లో ఆర్‌సీబీ ఓడించి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 2023లోనూ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌ని ఫైనల్‌లో ఓడించి టైటిల్ గెలిచింది.. ఈ రెండు సీజన్లలోనూ ఐపీఎల్ గెలిచిన కెప్టెన్ ధోనీయే..
 

411
Shakib Al Hasan

2011లో బంగ్లాదేశ్ జట్టుకి షకీబ్ అల్ హసన్ వన్డే కెప్టెన్‌గా వ్యవహరించాడు. తమీమ్ ఇక్బాల్ వెన్నుగాయంతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలోనే ఆడనుంది బంగ్లాదేశ్... 
 

511
Pep Guardiola

క్రికెట్‌లో మాత్రమే మిగిలిన ఆటల్లోనూ 2011 సీన్స్, 2023లో రిపీట్ అయ్యాయి. ఫుట్‌బాల్ విషయానికి వస్తే 2011లో స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ పెప్ గార్డియోలా, ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచింది. 2023లోనూ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ విజేతగా నిలిచింది పెప్ గార్డియోలా...

611

ఇక టెన్నిస్ విషయానికి వస్తే సెర్బియా టెన్నిస్ వీరుడు నొవాక్ జొకోవిక్, ఆస్ట్రేలియా ఓపెన్ 2011 విజేతగా నిలిచాడు. 2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఆండీ ముర్రేని ఓడించిన నొవాక్ జొకోవిచ్, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో  అమెరికా టెన్నిస్ ప్లేయర్ మెకెంజీ మెక్‌డొనాల్డోని ఓడించి... టైటిల్ సాధించాడు..
 

711

హాకీలోనూ 2011లో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత పురుషుల హాకీ జట్టు,2023లోనూ ఈ టైటిల్‌ని సొంతం చేసుకుంది... వీటన్నింటికంటే తెలుగు సినిమాకి సంబంధించిన ఓ విషయం మీమ్స్‌లో తెగ వైరల్ అవుతోంది..

811

2011లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘శక్తి’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఆ ఏడాది టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గెలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు మెహర్ రమేశ్ ‘షాడో’ పేరుతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. ఆ ఏడాది భారత జట్టు, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది..

911

10 ఏళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘భోళాశంకర్’, భయ్యర్లను నట్టేట ముంచేసింది. దీంతో మెహర్ రమేశ్ ఫ్లాప్ సినిమా సెంటిమెంట్ ప్రకారం ఈ సారి భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 గెలవడం ఖాయమంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

అదీకాకుండా ‘శక్తి’కి ముందు ఎన్టీఆర్, ‘అదుర్స్’, ‘బృందావనం’ వంటి హిట్లు కొడితే, ‘భోళాశంకర్’కి ముందు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ హిట్ అందుకున్నాడు. 

1011

అయితే 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు కూడా మహేంద్ర సింగ్ ధోనీ, ఇలాంటి ఓ బిస్కెట్ సెంటిమెంట్ చెప్పాడు. 2007లో ఓరియో ‘బిస్కెట్’ ఇండియాలో లాంఛ్ అయ్యిందని, 2022లో రీలాంఛ్ అవుతుండడంతో మనమే వరల్డ్ కప్ గెలుస్తామని చెప్పాడు. మాహీ కామెంట్స్, సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యాయి..

1111

అందుకే ఎన్ని రకాల సెంటిమెంట్స్ చెప్పినా, చాలామంది భారత క్రికెట్ అభిమానులకు ఈసారి భారత జట్టు, వరల్డ్ కప్ గెలుస్తుందంటే నమ్మకం కలగడం లేదు. 10 ఏళ్లుగా దెబ్బ మీద దెబ్బ తింటున్న క్రికెట్ ఫ్యాన్స్, ఈసారి కూడా నమ్మకం పెట్టుకుని, నిరుత్సాహపడేందుకు సిద్ధంగా లేమని కామెంట్లు చేస్తున్నారు.. 

click me!

Recommended Stories