యువరాజ్ సింగ్‌ని పక్కనబెట్టి, స్టువర్ట్ బిన్నీకి 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఛాన్స్... ధోనీతో విబేధాలే కారణమా...

Published : Aug 23, 2023, 06:50 PM IST

ఒక్క హెలికాఫ్టర్ సిక్సర్‌తో 2011 వన్డే వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం ధోనీ కొట్టేశాడని అంటారు చాలామంది టీమిండియా ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే ఫైనల్ దాకా ధోనీ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా రాలేదు మరి.. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ ధోనీ కంటే యువరాజ్‌కే ఎక్కువ దక్కాలి...

PREV
111
యువరాజ్ సింగ్‌ని పక్కనబెట్టి, స్టువర్ట్ బిన్నీకి 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఛాన్స్... ధోనీతో విబేధాలే కారణమా...

2007 టీ20 వరల్డ్ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటుతో 362 పరుగులు, బౌలింగ్‌లో 15 వికెట్లు తీసి అదరగొట్టాడు. మూడు కళ్లు చెదిరే క్యాచులతో భారత జట్టు, 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీ రోల్ పోషించాడు..

211

అలాంటి యువరాజ్ సింగ్‌కి, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి 2011 వన్డే వరల్డ్ కప్‌ గెలిచిన టీమ్‌లో చాలామంది ప్లేయర్లు, ఆ చారిత్రక విజయం తర్వాత ఆరు నెలలకే టీమ్‌లో ప్లేస్ కోల్పోయారు..

311

సచిన్ టెండూల్కర్ 2012 మార్చిలో ఆఖరి వన్డే ఆడగా, 2013 నవంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సరైన వీడ్కోలు, ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ దక్కించుకున్న ప్లేయర్ కూడా సచిన్ టెండూల్కర్ ఒక్కడే..

411

వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్ ప్లేయర్లు.. టీమ్‌లో చోటు కోల్పోయి, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆఖరికి 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ధోనీ కూడా ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు..

511

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్‌కి చికిత్స తీసుకుని, పూర్తిగా కోలుకున్న తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు యువరాజ్ సింగ్. అయితే అప్పటికే టీమ్‌పై ధోనీ ప్రభావం తీవ్రంగా పెరిగింది. దీంతో సెలక్టర్లు కూడా, దేశవాళీ పర్ఫామెన్స్‌లు, ఫామ్ ఇవేమీ పట్టించుకోకుండా మాహీ చెప్పిన వాళ్లకే, టీమ్‌లో చోటు కల్పించడం మొదలెట్టారు..

611

అదీకాకుండా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు లేకుండా టైటిల్ గెలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో మాహీ ఏం చెప్పినా, అది సెలక్టర్లకు శాసనంగా మారింది. 6 ఏళ్లలో 3 ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌కి ఎదురుచెప్పడానికి సెలక్టర్లు సాహసించలేకపోయారు..

711

అయితే దేశవాళీ టోర్నీల్లో చూపించిన పర్ఫామెన్స్ కారణంగా టీమ్‌లోకి తిరిగి వచ్చిన యువరాజ్ సింగ్, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్‌కి కష్టంగా ఉన్న పిచ్‌పై విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేస్తే యువరాజ్ 21 బంతులాడి 11 పరుగులే చేశాడు. ఇదే మ్యాచ్‌లో ధోనీ 7 బంతులాడి 4 పరుగులు చేసినా.. యువీ ముందు మాహీ ఇన్నింగ్స్ ఎవ్వరికీ కనిపించలేదు..
 

811

2011 వన్డే వరల్డ్ కప్‌ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకుని, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి క్రెడిట్ కొట్టేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎందుకు అలా చేయలేకపోయాడు? అనేది చాలామంది యువీ ఫ్యాన్స్ ప్రశ్న. అయితే ఈ ఇన్నింగ్స్ యువీని టీమ్‌కి దూరం పెట్టడానికి కారణమైంది.

911

2011 వన్డే వరల్డ్ కప్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన యువరాజ్ సింగ్ లేకుండానే 2015 వన్డే వరల్డ్ కప్ ఆడింది టీమిండియా. యువీ ప్లేస్‌లో రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ, 2015 ప్రపంచ కప్ ఆడాడు. యువరాజ్‌ని కాదని, స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేయడానికి అప్పటి హెడ్ కోచ్ డంకెన్ ఫ్లెట్చర్ ఇచ్చిన వివరణ కూడా హాట్ టాపిక్ అయ్యింది.

1011

‘ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో స్పిన్‌కి పెద్దగా సహకారం దక్కదు. అక్కడ సీమ్ బౌలింగ్ వేసే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కావాలి. స్టువర్ట్ బిన్నీ వల్ల ఎక్స్‌ట్రా బౌలర్, ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్ దొరికినట్టు అవుతుంది. అందుకే అతన్ని ఎంపిక చేశాం.. ’ అంటూ కామెంట్ చేశాడు డంకెన్ ఫ్లెట్చర్..

1111

వన్డే వరల్డ్ కప్ 2015 టోర్నీకి ఎంపికైనప్పటికీ, రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు స్టువర్ట్ బిన్నీ. 2015 వన్డే వరల్డ్ కప్‌కి ముందు 9 వన్డేలు ఆడి 13 వికెట్లు మాత్రమే తీసిన బిన్నీ, కేవలం యువరాజ్ సింగ్‌ని పక్కనబెట్టడానికి ధోనీ వాడిన ఆయుధంగా చెబుతారు యువీ ఫ్యాన్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories