శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌ కాదు, వీవీఎస్ లక్ష్మణ్‌లా బ్యాటింగ్ చేయగలడు... మాజీ సెలక్టర్ కామెంట్...

First Published | Jun 29, 2021, 4:38 PM IST

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, భారత బ్యాటింగ్ ఆర్డర్‌లోని లోపాలను బయటపెట్టింది. దీంతో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ని ఆడించాలా? లేక విదేశాల్లో అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్న మయాంక్ అగర్వాల్‌ను ఆడించాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది...

గత పర్యటనలో ఇంగ్లాండ్‌లో సత్తా చాటి, డబ్ల్యూటీసీ టోర్నీ 2019-21 సీజన్‌లో మూడు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలతో సత్తా చాటిన మయాంక్ అగర్వాల్‌కి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు కామెంట్ చేస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే ఇంగ్లాండ్ టూర్‌లో శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా కాకుండా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడించాలని అంటున్నాడు మాజీ సెలక్టర్, క్రికెటర్ గగన్ కోడా..

‘శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా ఆడించడం కరెక్టు కాదు. అతను వెరీ వెరీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ లాంటోడు. మిడిల్ ఆర్డర్‌లో వస్తే అద్భుతంగా రాణించగలడు...
ఆస్ట్రేలియాలో రెండు టెస్టుల్లో ఆడలేకపోయాడని చెప్పి మయాంక్ అగర్వాల్‌ను పక్కనబెట్టడం సరైన నిర్ణయం కాదు. అతనిలో చాలా టాలెంట్ ఉంది... దాన్ని టీమ్ సరిగ్గా ఉపయోగించుకోవాలి...
ఆస్ట్రేలియాలో ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయిన తర్వాత పృథ్వీషాను కూడా పక్కనబెట్టేశారు. ఇది సరైన నిర్ణయం కాదు... ఇంగ్లాండ్ పిచ్‌లు స్పిన్‌కి అనుకూలించడం లేదని తేలిపోయింది.
కాబట్టి రవీంద్ర జడేజాకి బదులుగా ఓ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేదా పేస్ ఆల్‌రౌండర్ జట్టులో వస్తే బెటర్... శార్దూల్ ఠాకూర్‌కి అవకాశం ఇస్తే బెటర్..
లోయర్ ఆర్డర్‌లో పరుగులు రావాలంటే ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం చాలా ఉంది. ఇప్పటికే శార్దూల్ ఠాకూర్ ఈ విషయంలో నిరూపించుకున్నాడు కూడా...
టీమిండియా రిజర్వు బెంచ్‌లోనూ స్టార్ ప్లేయర్లు ఉన్నారు, వారిని సరిగ్గా వాడుకోగలిగితే సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, సెలక్టర్ గగన్ కోడా...
గగన్ కోడా చెప్పినట్టు మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపించి, శుబ్‌మన్ గిల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే ఛతేశ్వర్ పూజారా స్థానం ప్రమాదంలో పడ్డట్టే.
ఒకవేళ పూజారా వన్‌డౌన్‌లో అలాగే ఉంచి, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ వచ్చే రవీంద్ర జడేజా స్థానంలో గిల్‌ని ఆడించాలంటే అదనపు పేసర్‌ని ఆడించే అవకాశం ఉండదు...

Latest Videos

click me!