టీమిండియాకి భారీ షాక్... గాయంతో స్టార్ ఓపెనర్ అవుట్... ఆ ఇద్దరికీ లైన్ క్లియర్...

First Published Jul 1, 2021, 9:35 AM IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకి భారీ షాక్ తగిలింది. టీమిండియాకి టెస్టుల్లో ఓపెనర్‌గా సెటిల్ అయిన యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మతో కలిసి మొదటి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, 28 పరుగులు చేశాడు...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఓ ఇంటర్నెల్ గాయంతో బాధపడుతున్నట్టు తేల్చారు వైద్యులు. ఈ గాయానికి సర్జరీ అవసరం కావడంతో అతను ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.
undefined
ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభం అవుతుంది. దీనికి ఇంకా నెలకు పైగా సమయం ఉన్నప్పటికీ శుబ్‌మన్ గిల్ శస్త్రచికిత్స తర్వాత కోలుకుని, టీమిండియాకి అందుబాటులో ఉండడానికి ఇంకా ఎక్కువే టైమ్ పడుతుందని తేల్చారు వైద్యులు.
undefined
‘భారత జట్టులో ఓ మార్పు జరిగింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నెల రోజులు ఉన్నప్పటికీ, గిల్ గాయం నుంచి కోలుకోవడానికి టైం పడుతుండడంతో అతను టూర్ మొత్తానికి దూరం కానున్నాడు. శుబ్‌మన్ గిల్ తీవ్రమైనదిగా తేలుతుంది..’ అంటూ బీసీసీఐ అధికారి తెలియచేశారు.
undefined
ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన శుబ్‌మన్ గిల్, గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు...
undefined
శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌ను ప్రధాన జట్టులోకి భాగం చేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ...
undefined
అయితే ఇప్పటికే టీమిండియాలో ఓపెనర్ స్థానం కోసం మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ ఎదురుచూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ 2019-21 సీజన్‌లో రెండు డబుల్ సెంచరీలతో రాణించిన మయాంక్ అగర్వాల్, ఇంగ్లాండ్ టూర్‌లో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకోవచ్చు.
undefined
శుబ్‌మన్ గిల్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన అభిమన్యు ఈశ్వరన్, బీహార్ జట్టు తరుపున అద్భుతంగా రాణిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు...
undefined
58 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అభిమన్యు ఈశ్వరన్, 13 సెంచరీలతో 4227 పరుగులు చేయగా, 57 లిస్టు ఏ మ్యాచుల్లో 6 సెంచరీలతో 2656 పరుగులు చేశాడు.
undefined
click me!