శుబ్‌మన్ గిల్లుడంతా స్వదేశంలోనేనా! విదేశాల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న యంగ్ బ్యాటర్...

Published : Jul 17, 2023, 03:05 PM IST

కొద్ది మ్యాచులకే టీమిండియా ఫ్యూచర్ స్టార్ ప్లేయర్‌గా అవతరించాడు శుబ్‌మన్ గిల్. ఈ ఏడాది బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, టీ20ల్లో ఓ సెంచరీ, టెస్టుల్లో ఓ సెంచరీతో పాటు వన్డేల్లో మూడు సెంచరీలు బాదాడు, ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది..   

PREV
17
శుబ్‌మన్ గిల్లుడంతా స్వదేశంలోనేనా! విదేశాల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న యంగ్ బ్యాటర్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన శుబ్‌మన్ గిల్... ఆ తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...
 

27
Shubman Gill

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసి అవుట్ అయిన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులకి పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ అవుట్ గురించి వివాదం రేగినా, అతను ఆడిన షాట్‌పై పెద్ద డిస్కర్షన్ జరగలేదు..

37

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శుబ్‌మన్ గిల్, 11 బంతుల్లో ఓ ఫోర్ బాది 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్‌కి కష్టంగా మారిన పిచ్ మీద సెటిల్ అవ్వడానికి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రాధాన్యం ఇస్తే.. శుబ్‌మన్ గిల్ మాత్రం తొందరపడి వికెట్ పారేసుకున్నాడు..

47
Shubman Gill-Virat Kohli

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్‌లో రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, గబ్బా టెస్టులో 91 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిపోయాడు..

57

అయితే ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ బ్యాటు నుంచి విదేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. 2021 స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 29, 50, 0, 14, 11, 15, 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచిన శుబ్‌మన్ గిల్.. గాయంతో ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్ నుంచి దూరమయ్యాడు. 

67
Sgubman Gill

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. గాయాన్ని దాచి పెట్టి ఆ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులే చేశాడు...

77
Shubman Gill

స్వదేశంలో సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతున్న శుబ్‌మన్ గిల్, విదేశాల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో శుబ్‌మన్ గిల్లుడంతా స్వదేశంలోనే అంటున్నారు నెటిజన్లు. అయితే అనుభవంతో విదేశాల్లోనూ శుబ్‌మన్ గిల్ రాణించే అవకాశం ఉంది. లేదంటే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలతో పోల్చబడిన శుబ్‌మన్ గిల్, ఓ సాధారణ బ్యాటర్‌గానే మిగిలిపోవాల్సి ఉంటుంది.. 

Read more Photos on
click me!

Recommended Stories