క్రికెట్‌ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు! వరల్డ్ కప్‌లో పాక్ ఆడాల్సిందే... - మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్

Chinthakindhi Ramu | Published : Jul 17, 2023 1:31 PM
Google News Follow Us

పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ 2023 టోర్నీ కోసం ఇండియా, అక్కడికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాక్ టీమ్, ఇండియాకి వెళ్లకూడదని డిమాండ్ చేస్తున్నారు చాలా మంది మాజీ క్రికెటర్లు. అయితే షాహిద్ ఆఫ్రిదీ, మిస్బా వుల్ హక్ వంటి మాజీలు మాత్రం వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడాల్సిందేనని అంటున్నారు...

15
క్రికెట్‌ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు! వరల్డ్ కప్‌లో పాక్ ఆడాల్సిందే...  - మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్

అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని లైవ్‌లో లక్షా 30 వేల మంది చూడబోతున్నారు. ఈ మ్యాచ్ టీఆర్పీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం..
 

25

‘ఇండియా- పాకిస్తాన్ మధ్య క్రీడా పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్ తప్ప హాకీ, కబడ్డీ వంటి టోర్నీలు జరుగుతున్నాయి. మరి క్రికెట్‌‌ని మాత్రం ఎందుకు రాజకీయం చేస్తున్నారు. దయచేసి క్రికెట్‌ని రాజకీయాలతో ముడి పెట్టకండి..
 

35
India vs Pakistan

ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని కొన్ని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తుంటారు. వారికి డిస్సప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు. పాకిస్తాన్, కచ్ఛితంగా ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడి తీరాలి..

Related Articles

45
misbah ul haq and pakistan team

ఇంతకుముందు చాలా సార్లు ఇండియాలో మ్యాచులు ఆడాం, అక్కడ మ్యాచులకు కొన్ని వేల మంది వస్తారు. ఆ వాతావరణం చాలా బాగుంటుంది. ప్రతీ పాక్ క్రికెటర్ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇండియాలో మ్యాచ్‌లు ఆడితే మరింత కసిగా ఆడాలనే పట్టుదలను పెరుగుతుంది..

55

భారత్‌లో బాగా ఆడగల సత్తా మన టీమ్‌కి ఉంది. క్రికెట్‌కి సంబంధం లేని విషయాలను ఆటలోకి తీసుకురావద్దు. పర్ఫెక్ట్ టీమ్‌ని ఎంపిక చేయడంపైన, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌‌లో బాగా ఆడడంపైనే టీమ్ ఫోకస్ ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్.. 

Recommended Photos