ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చా! ధోనీ, నా దగ్గరికి వచ్చి ఒకే మాట అన్నాడు... - యజ్వేంద్ర చాహాల్

Chinthakindhi Ramu | Published : Jul 17, 2023 1:52 PM
Google News Follow Us

టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చిన యజ్వేంద్ర చాహాల్, ధోనీ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడాడు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు యజ్వేంద్ర చాహాల్..

16
ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చా! ధోనీ, నా దగ్గరికి వచ్చి ఒకే మాట అన్నాడు... - యజ్వేంద్ర చాహాల్

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్... వన్డే, టీ20 టీమ్‌లో ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగారు. ఈ ఇద్దరూ కలిసి టీమ్‌కి ఎన్నో విజయాలు అందించారు. కుల్దీప్ యాదవ్, టీమ్‌కి దూరమైనా యజ్వేంద్ర చాహాల్‌... పేలవ పర్ఫామెన్స్‌తో టీమ్‌కి దూరమైన సందర్భాలు చాలా తక్కువ..

26

‘మహేంద్ర సింగ్ ధోనీ దగ్గర మాత్రమే నేను నా నోటిని చాలా జాగ్రత్తగా వాడతాను. అనవసరంగా ఏదీ మాట్లాడను. బుద్ధిగా కూర్చొని, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతాను. లేదంటే సైలెంట్‌గా కూర్చుంటాను..

36
MS Dhoni, Yuzvendra Chahal, Virat Kohli

సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌లో ఓ టీ20 మ్యాచ్ ఆడుతున్నాం. అప్పటిదాకా నేను చాలా పొదుపుగా బౌలింగ్ చేసేవాడిని. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చేశా. హెన్రీచ్ క్లాసిన్ అయితే నా బౌలింగ్‌లో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు..

Related Articles

46
chahal

ధోనీ అరౌండ్ ద వికెట్ బాల్ వేయమని చెప్పాడు.. నేను అలాగే వేశా, కానీ క్లాసిన్ దాన్ని సిక్సర్‌గా మలిచాడు. నేను చాలా నిరాశగా తర్వాతి బాల్ వేయడానికి వెళ్తుంటే మాహీ భాయ్ వచ్చి, నా మీద చెయ్యి వేసి... ‘‘ఈరోజు నీది కాదు. ఏం బాధపడకు...’’ అన్నాడు..

56

నాకు చాలా ఓదార్పునిచ్చిందామాట. ఇంకో ఐదు బాల్స్ ఉన్నాయి, వాటిల్లో బౌండరీ ఇవ్వకుండా అడ్డుకుంటే టీమ్‌కి హెల్ప్ అవుతుందని అన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది. మనది కాని రోజుల్లో కూడా టీమ్‌ మనకి అండగా ఉంటుందని..’ అంటూ చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్...

66
Chahal dhoni

టీమిండియా తరుపున 72 వన్డేలు, 75 టీ20 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, వన్డేల్లో 121, టీ20 మ్యాచుల్లో 91 వికెట్లు తీశాడు. 145 ఐపీఎల్ మ్యాచుల్లో 187 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్, ఇప్పటిదాకా టెస్టు ఆరంగ్రేటం చేయలేకపోయాడు.. 

Read more Photos on
Recommended Photos