శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... డ్రా కోసం పూజారా ప్రయత్నం... లంచ్ సమయానికి...

First Published Jan 19, 2021, 7:41 AM IST

గబ్బా టెస్టులో భారత జట్టు లంచ్ విరామానికి ఓ వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచినా... యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ తనదైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా జిడ్డు ఆటతో డ్రా కోసం ప్రయత్నిస్తున్నాడు. విజయానికి 245 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా... ఇంకా 62 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

ఓవర్‌నైట్ స్కోరు 40 వద్ద ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా... 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది...
undefined
21 బంతుల్లో 7 పరుగులు చేసిన రోహిత్ శర్మ... ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
undefined
ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్...
undefined
నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్... అతి పిన్న వయసులో నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.
undefined
21 ఏళ్ల 129 రోజుల వయసులో నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాదిన గిల్, దిలీప్ వెంగసర్కార్ రికార్డును బ్రేక్ చేశాడు. పాక్ ప్లేయర్ ఇజాజ్ అహ్మద్ మాత్రమే గిల్ కంటే 15 రోజుల చిన్న వయసులో ఈ ఫీట్ సాధించాడు.
undefined
గిల్, పూజారా రెండో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు... లంచ్ సమయానికి గిల్ 117 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
undefined
మరోవైపు ఛతేశ్వర్ పూజారా 90 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి... తనదైన టెస్టు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు...
undefined
భారత జట్టు విజయానికి ఇంకా 245 పరుగుల దూరంలో ఉంది. అయితే పూజారా బ్యాటింగ్ చూస్తుంటే డ్రా కోసమే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
undefined
click me!