హైదరాబాద్ కుర్రాడు, మగాడిలా మారాడు... మహ్మద్ సిరాజ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్....

First Published Jan 19, 2021, 6:17 AM IST

మహ్మద్ సిరాజ్... ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. సీనియర్లు బౌలర్లు లేకుండా ఆఖరి టెస్టులో బరిలో దిగిన భారత జట్టుకి, ఆ లోటు తేలికుండా చేశాడు సిరాజ్. బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించడమే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి, అద్బుతం చేశాడు. సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

ఆఖరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్... మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్ వికెట్ తీశాడు...
undefined
ఆ తర్వాత సిరాజ్‌కి మరో వికెట్ దక్కకపోయినా 10 మెయిడిన్లు వేయడమే కాకుండా యువ బౌలర్లను మార్గనిర్దేశం చేసి అందర్నీ ఫిదా చేశాడు.
undefined
ఒక్క వికెట్ తీసినా మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన విధానం సూపర్ అంటూ సచిన్ టెండూల్కర్ పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇప్పుడు ఈ వీరేంద్ర సెహ్వాగ్ కూడా సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
undefined
‘ఈ కుర్రాడు మగాడిలా మారాడు. ఒకే సిరీస్‌లో గల్లీ బాయ్ నుంచి మగాడిలా అవతరించాడు... తొలి టెస్టు సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, బౌలింగ్ విభాగానికి లీడర్‌గా వ్యవహరించాడు...
undefined
నాయకుడిగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి తన జట్టును ముందుండి నడిపించాడు. ఈ టెస్టు సిరీస్ భారత యువ బౌలర్ల ప్రదర్శనతో చిరకాలం గుర్తుండిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా సిరాజ్ బౌలింగ్‌ను కొనియాడింది...
undefined
‘ఆసీస్ సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా ఆడుతున్నాడు. కసిగా మనసు పెట్టి బౌలింగ్ చేస్తున్నాడు... టెస్టుల్లో ఐదు వికెట్లు తీసినందుు అతనికి అభినందలు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది మిథాలీరాజ్...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్... లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్‌లను అవుట్ చేసి... ఆస్ట్రేలియా కీలక వికెట్లు పడగొట్టాడు.
undefined
వేగంగా పరుగులు చేసి ఆసీస్ సీనియర్ పేసర్ స్టార్క్‌ను అవుట్ చేసిన సిరాజ్, హజల్‌వుడ్‌ను పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను ఆలౌట్ చేశాడు...
undefined
click me!