సెంచరీ ముంగిట శుబ్‌మన్ గిల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

First Published Jan 19, 2021, 9:14 AM IST

గబ్బా టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మొట్టమొదటి సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు శుబ్‌మన్ గిల్. దీంతో 114 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా స్పీడ్ పెంచింది. శుబ్‌మన్ గిల్ దూకుడు కొనసాగించగా, లంచ్ బ్రేక్ తర్వాత ఛతేశ్వర్ పూజారా కూడా మూడు బౌండరీలు బాది వేగం పెంచాడు.
undefined
శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా కలిసి రెండో వికెట్‌కి 114 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
మిచెల్ స్టార్క్ వేసిన 12వ ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదగా, పూజారా ఓ ఫోర్ బాదాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 20 పరుగులు రాబట్టింది టీమిండియా.
undefined
మిచెల్ స్టార్క్ టెస్టు కెరీర్‌లోనే ఇదే అత్యంత చెత్త రికార్డు. ఇంతకుముందు ఎప్పుడూ ఒక ఓవర్‌లో ఇన్ని పరుగులు సమర్పించలేదు స్టార్క్...
undefined
నాలుగో ఇన్నింగ్స్‌లో 91 పరుగుల వద్ద అవుటైన శుబ్‌మన్ గిల్... ఆస్ట్రేలియాలో నాలుగో ఇన్నింగ్స్‌లో 90ల్లో అవుటైన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
undefined
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ 97 పరుగులకి అవుట్ కాగా, 2014లో మురళీ విజయ్ 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు...
undefined
ఆస్ట్రేలియాలో అతి పిన్న వయసులో 90ల్లో అవుటైన ప్లేయర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. గిల్ వయసు 21 ఏళ్ల 129 రోజులు...
undefined
వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్‌కి ఇది టెస్టుల్లో 398వ వికెట్...
undefined
132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. విజయానికి ఇంకా 196 పరుగులు కావాలి... కావాల్సిన రన్‌రేట్ 4 పరుగుల లోపే...
undefined
ఛతేశ్వర్ పూజారా 125 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు...
undefined
click me!