Shubman Gill in ₹450 crore chit fund fraud case: గుజరాత్‌లో ₹450 కోట్ల చిట్ పండ్ మోసం కేసులో భారత స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ సహా ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ టీమ్ లోని మరో నలుగురు ప్లేయర్ల పేర్లు ఉన్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోంజీ స్కామ్ సెగ క్రికెటర్లనూ తాకడంలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఈ కేసును గుజరాత్ CID పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుభ్ మన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తివేటియా, మోహిత్ శర్మ పేర్లు కూడా ఉన్నాయి. నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేయాలని గుజరాత్ CID పోలీసులు భావిస్తున్నారు.
రూ.450 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణంలో గుజరాత్ ప్లేయర్లు
ఇటీవల, రూ.450 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడైన భూపేంద్రసింగ్ జాలాను అధికారులు విచారించారు. బ్యాంకులు అందించే దాని కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ అరెస్ట్ విచారించగా క్రికెటర్ల అంశం బయటకు వచ్చిందని సమాచారం.
ఈ చిట్‌ఫండ్ లో క్రికెటర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తివేటియా, మోహిత్ శర్మ పెట్టుబడి పెట్టారు. భూపేంద్రసింగ్ జాలా వాంగ్మూలం ఆధారంగా మోసానికి సంబంధించి క్రికెటర్లపై గుజరాత్ CID పోలీసులు చర్యలు తీసుకోనున్నారని సమాచారం.
ప్రస్తుతం శుభ్ మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్థానంలో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వస్తారు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ తో పాటు నలుగురు క్రికెటర్లకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
₹450 కోట్ల చిట్ ఫండ్ మోసం ఎలా జరిగింది?
గుజరాత్ సీఐడీ ప్రకారం.. థలోత్, హిమ్మత్‌నగర్, వడోదరతో సహా గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించారు. పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించడానికి అనేక మంది ఏజెంట్లను నియమించాడు. ICICI బ్యాంక్, IFC బ్యాంక్ ద్వారా ₹6,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 IPLలో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా ₹1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
మోహిత్ శర్మ, సాయి సుదర్శన్, రాహుల్ తేవాటియా లకు తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. సంబంధిత విషయాలపై క్రికెటర్లు ఇంకా ఎవరూ స్పందించలేదు. పెట్టుబడులను సేకరించిన సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో పలువురు ఫిర్యాదు చేయడంలో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
విచారణకు క్రికెటర్ల సహకారం ఉంటుందా?
అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (CID-క్రైమ్) పరీక్షిత్ రాథోడ్ మాట్లాడుతూ.. ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించినట్లు జాలా కంపెనీ అయిన పిజెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెంట్లు తెలిపారు. మోసం ఫిర్యాదులు రావడంతో CID దర్యాప్తు ప్రారంభించింది. అప్పుడు జాలా పరారయ్యాడు. ఒక నెల తర్వాత అంటే డిసెంబర్ 27న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో అతన్ని అరెస్టు చేశారు. జనవరి 4 వరకు జాలాను కస్టడీలో ఉంచారు. ఈ కేసులో మరో ఏడుగురిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపాడు. .
Gujarat Titans, Shubman Gill
పోంజీ స్కామ్.. ఎవరీ భూపేంద్రసింగ్ జలా?
రూ. 450 కోట్ల పోంజీ స్కీమ్ ప్రధాన ఆపరేటర్ భూపేంద్రసింగ్ జలా. అతను గుజరాత్‌లోని సబర్‌కాంతలోని హిమ్మత్‌నగర్ పట్టణానికి చెందినవాడు. 2020-2024 మధ్య తన సంస్థ BZ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా 11,000 మందికి పైగా పెట్టుబడిదారుల నుండి వేలకోట్లను సేకరించారు. దాదాపు రూ. 450 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని గుర్తించారు. బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే అధికంగా వడ్డీ అందిస్తామని చెప్పి పెట్టుబడిదారులను ఆకర్షించాడు. ప్రారంభంలో వారి విశ్వాసాన్ని పొందేందుకు ఈ వాగ్దానాలను నెరవేర్చాడు. అయితే, సంస్థ పనితీరుపై అనుమానంతో పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.