భార‌త జ‌ట్టు నుంచి రోహిత్ శ‌ర్మ త‌ప్పుకున్నాడా? త‌ప్పించారా?

First Published | Jan 3, 2025, 6:24 PM IST

Rohit Sharma: ప్రస్తుతం ఆస్ట్రేలియా-భార‌త్ లు బోర్డర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో చివ‌రి టెస్టును ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆడ‌టం లేదు. అయితే, రోహిత్ శ‌ర్మ‌నే టీమ్ నుంచి త‌ప్పుకున్నాడా?  లేదా జ‌ట్టు నుంచి ఔట్  చేశారా? అనే కొత్త చ‌ర్చ మొద‌లైంది.

Rohit Sharma: భార‌త జ‌ట్టుకు అనేక అద్భుత‌మైన విజయాలు అందించిన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌. ప్ర‌పంచ వేదిక‌పై భార‌త క్రికెట్ జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. అయితే, టెస్టు క్రికెట్ లో అత‌ను ఫామ్ కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు. గ్రౌండ్ లో ప‌రుగులు రాబ‌ట్ట‌లేక‌పోతున్నాడు. దీంతో అత‌ను చివ‌రికి అత‌ని కెప్టెన్సీని స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు అప్ప‌గించాల్సి వ‌చ్చింది. అలాగే, జ‌ట్టులో స్థానం కోల్పోవాల్సి వ‌చ్చింది.

సిడ్నీలో జ‌రుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ ఆడ‌క‌పోవ‌డం పై క్రికెట్ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ జ‌రిగిన‌ట్టేన‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, జ‌ట్టు నుంచి రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించారా?  లేక అత‌నే త‌ప్పుకున్నాడా? అనే కొత్త చ‌ర్చ మొద‌లైంది.

బ్యాటింగ్, కెప్టెన్సీలో విఫలమైన రోహిత్ శర్మ

భారత్, ఆస్ట్రేలియాల మధ్య చివరిదైన 5వ టెస్ట్ సిడ్నీలో మొదలైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ టెస్ట్‌లో రోహిత్ శర్మ ఉండరనీ, బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే రోహిత్ శర్మ ప్లేయింగ్ 11 లో లేరు. 

మొదటి టెస్ట్‌కి కెప్టెన్‌గా ఉన్న బుమ్రా, చివరి టెస్ట్‌లో మళ్ళీ కెప్టెన్ అయ్యారు. సిడ్నీ టెస్ట్‌కి రోహిత్ శర్మ లేకపోవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. 6 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశారు. అదేవిధంగా కెప్టెన్సీలో కూడా విఫలమయ్యారు. ఇది భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. 


రోహిత్ శర్మను తప్పించారా? స్వయంగా తప్పుకున్నాడా?

ఫీల్డింగ్ సెట్ చేయడంలోనే కాకుండా బౌలర్లను మార్చడంలో కూడా రోహిత్ శర్మ తడబడ్డారు. దీంతో ఆయన టీంలో ఉండరని అందరూ ఊహించారు. కానీ ఆయన్ని తప్పించారా లేక ఆయనే తప్పుకున్నారా అనేది తెలియదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ 3 టెస్టులు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో  కేవ‌లం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

37 ఏళ్ల రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ ఆట‌లో సౌకర్యవంతంగా కనిపించలేదు. అలాగే, అతనికి తెలిసిన షాట్‌లను కూడా ఆడలేకపోయాడు. 2024లో టెస్టు క్రికెట్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 26 ఇన్నింగ్స్‌ల్లో 24.76 సగటుతో 619 పరుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 

రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు - గంభీర్ అలా సూటిగానే చెప్పారా? 

మరీ ముఖ్యంగా మెల్‌బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మ పై విమర్శలు గుప్పించారు. అలాగే, విరాట్ కోహ్లీపై కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జట్టు ప్రదర్శన నేపథ్యంలో  టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం హీటెక్కిందని రిపోర్టులు పేర్కొన్నాయి. 

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూటిగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై గరంగరం అయ్యాడని సంబంధిత కథనాలు పేర్కొన్నాయి. 'సిడ్నీలో జరిగే చివరి టెస్ట్‌లో నువ్వు ఉండవు' అని రోహిత్‌ శర్మ నేరుగా చెప్పారనీ, ఆయన్ని తప్పించారని వార్తలు వచ్చాయి.  ఇదే సమయంలో రోహిత్ శర్మను భారత జట్టు నుంచి తప్పించలేదనీ, జట్టు ప్రయోజనాల నేపథ్యంలో ఆయనే స్వయంగా తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

రోహిత్ జట్టులో లేకపోవడం గురించి జస్ప్రీత్ బుమ్రా ఏం చెప్పారంటే?  

పలు మీడియా నివేదికల ప్రకారం.. మెల్‌బోర్న్ టెస్ట్ ఓటమితో మనస్తాపం చెందిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఇక తాను జట్టుకు భారం కాకూడదని భావించి స్వయంగా తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్‌లో రోహిత్ శర్మ లేకపోవడంపై కెప్టెన్ గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా వివరణ ఇచ్చారు. రోహిత్ జట్టులో ఎందుకు లేరనే సమాచారం అందించారు.

5వ టెస్ట్‌లో కెప్టెన్ వ్యవహరిస్తున్న స్టార్ బౌలర్ బుమ్రా టాస్ తర్వాత మమాట్లాడుతూ.. ''మా కెప్టెన్ రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను చూపించారు. ఈ మ్యాచ్‌లో ఆయన విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది జట్టులో ఐక్యత, స్వార్థం లేకపోవడాన్ని చూపిస్తుంది. టీంకి ఏది మంచిదో అదే చేస్తాం'' అని అన్నారు.

రిటైర్మెంట్ పై ఏం మాట్లాడని రోహిత్ శర్మ 

అంటే బుమ్రా చెప్పిన వివరాల ప్రకారం.. భారత జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారని అర్థమవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టైటిల్ ను నిలబెట్టుకోవాలంటే భారత జట్టు విజయం అవసరం. ఇలాంటి కీలక మ్యాచ్ కు ఫామ్ తో ఇబ్బంది పడుతున్న తాను జట్టు ప్రదర్శనకు, జట్టుకు భారం కాకూడదని తప్పుకున్నట్టు స్పష్టమవుతోంది. 

అయితే, బుమ్రా కామెంట్స్ తో సంబంధం లేకుండా రోహిత్ శర్మ గురించి సోషల్ మీడియాతో పాటు క్రికెట్ సర్కిల్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో మెల్‌బోర్న్ టెస్ట్ రోహిత్ శర్మ ఆడిన చివరి టెస్ట్ అయ్యే అవకాశం ఉందని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, తన టెస్టు క్రికెట్ కెరీర్ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలు రోహిత్ శర్మ గానీ, భారత జట్టు గానీ స్పందించలేదు. ఇక తాను జట్టులో లేకపోవడం గురించి బుమ్రా చెప్పిన దానిపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

Latest Videos

click me!