వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కే ఆ అరుదైన ఛాన్స్...

First Published Mar 22, 2021, 6:14 PM IST

భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కి ఓ అరుదైన అవకాశం దక్కింది. 157 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న లాన్‌షైర్ క్రికెట్ క్లబ్ తరుపున రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలో ఆడబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్... 

ఇప్పటిదాకా ఐదుగురు భారత క్రికెటర్లకు మాత్రమే లాన్‌షైర్ క్రికెట్ క్లబ్ తరుపున ఆడే అవకాశం దక్కింది. ఫరూక్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్‌, వీవీఎస్ లక్ష్మణ్... ఇప్పటికే ఈ ఘనత సాధించగా శ్రేయాస్ అయ్యర్, ఆ లిస్టులో చేరబోతున్నాడు...
undefined
‘లాన్‌షైర్ ఓ లెజెండరీ క్రికెట్ క్లబ్. దానికి ఇంగ్లాండ్ క్రికెట్‌తో, భారత క్రికెట్‌తో కూడా ఎంతో అనుబంధం ఉంది... ఫరూక్ ఇంజనీర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి లెజెండ్స్ ఆడిన క్లబ్ తరుపున ఆడబోతుండడం గర్వంగా భావిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
undefined
భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ క్రికెట్ ఆడాడు. అయితే అతను 2014లో డర్బీ‌షైర్, 2015లో యార్క్‌షైర్, 2017లో నాటింగ్‌గమ్‌షైర్, 2018లో యార్క్‌షైర్ తరుపున కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్నాడు...
undefined
2021 రాయల్ లండన్ కప్, వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. 2014లో ప్రారంభమైన ఈ టోర్నీలో లాన్‌షైర్‌తో పాటు 18 జట్లు పాల్గొంటాయి.
undefined
ఈ ఏడాది జూలై 22, 2021న ఆరంభమయ్యే రాయల్ లండన్ వన్డే కప్, ఆగస్టు 19, 2021న ముగియనుంది. ఈ టోర్నీ కోసం జూలై 15న ఓల్డ్ ట్రాఫోర్ట్ వెళ్లనున్నాడు శ్రేయాస్ అయ్యర్...
undefined
అయితే ఈ సమయంలో టీమిండియా, జూన్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ముగించుకుని జింబాబ్వే టూర్‌‌కి వెళ్లనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.
undefined
రాయల్ లండన్ కప్‌లో లాన్‌షైర్ క్లబ్‌కి సంతకం చేసినందున ఈ సిరీస్‌లకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది...
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి నాయకత్వం వహించిన శ్రేయాస్ అయ్యర్, తన జట్టును తొలిసారి ఫైనల్ చేర్చిన విషయం తెలిసిందే...
undefined
click me!