ఇప్పుడు చెప్పండి! సచిన్ టెండూల్కర్ మంచి కెప్టెన్ కాదా... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో...

First Published Mar 22, 2021, 4:26 PM IST

సచిన్ టెండూల్కర్... ‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడిన గొప్ప బ్యాట్స్‌మెన్. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ కెరీర్‌లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసిన బ్యాట్స్‌మెన్... కానీ ఆయన క్రికెట్ ప్రస్థానంలో మచ్చగా మిగిలిపోయింది కెప్టెన్సీ...

1996లో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సచిన్ టెండూల్కర్, 73 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో 23 మ్యాచుల్లో టీమిండియా గెలవగా, 43 మ్యాచుల్లో మ్యాచుల్లో ఓడింది... విజయాల శాతం కేవలం 35.07 మాత్రమే...
undefined
టెస్టుల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 25 మ్యాచుల్లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన సచిన్ టెండూల్కర్, కేవలం నాలుగింట్లో మాత్రమే విజయాన్ని అందించగలిగాడు... విజయాల శాతం 16 కంటే తక్కువే...
undefined
ప్రస్తుత తరంలో సచిన్ వారసుడిగా గుర్తించబడుతున్న విరాట్ కోహ్లీకి, టెండూల్కర్‌కి తేడా ఇదొక్కటే... విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా రికార్డులు క్రియేట్ చేస్తుంటే, సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో మాత్రం కెప్టెన్సీ ఓ పీడకలగా మిగిలిపోయింది...
undefined
భారత జట్టు కెప్టెన్సీని వదిలేసిన 21 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా ఓ అద్భుతమైన టోర్నీని గెలిచాడు సచిన్ టెండూల్కర్. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన సచిన్, టైటిల్ కైవసం చేసుకున్నాడు...
undefined
యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్, గోనీ... ఇలా సీనియర్ల జట్టును అద్భుతంగా నడిపించి, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ టైటిల్‌ను గెలిపించగలిగాడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్...
undefined
తాజాగా సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీపై స్పందించాడు మాజీ సెలక్టర్ శశి ఠాకూర్... ‘సచిన్ టెండూల్కర్ చెడ్డ కెప్టెన్ ఏం కాదు, కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా జట్టు విజయం కోసం తాను చేయగలినంతా చేయగలిగాడు...
undefined
కానీ అప్పటి భారత జట్టు పరిస్థితి మరోలా ఉండేది. సచిన్ టెండూల్కర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విదేశీ గడ్డలపై పరుగులు చేయడానికి ఇబ్బందిపడేవాళ్లు... విజయం కోసం పోరాడాలనే తపన కూడా జట్టులో కనిపించేది కాదు...
undefined
అందుకే తన కెప్టెన్సీ సమయంలో బ్యాట్స్‌మెన్‌ సూపర్ సక్సెస్ అయినా సచిన్ టెండూల్కర్‌కి విజయాలు మాత్రం రాలేదు... తనని తాను గొప్ప స్ఫూర్తిదాయకమైన కెప్టెన్‌ను కాదని నిర్ణయించుకుని, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు సచిన్...
undefined
ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మరోసారి సచిన్ టెండూల్కర్‌ను జట్టును నడిపించాల్సిందిగా కోరారు సెలక్టర్లు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించిన సచిన్, ధోనీ పేరును ప్రతిపాదించాడు...
undefined
ఇప్పుడున్న ప్లేయర్లు, ఆనాడు సచిన్ టెండూల్కర్‌కి దొరికి ఉంటే అతను కూడా మంచి కెప్టెన్ అయ్యేవాడు’ అంటూ కామెంట్ చేశాడు...
undefined
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన సచిన్ టెండూల్కర్, టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. అయితే ఎట్టకేలకు మంచి పోటీ జరిగిన టీ20 లీగ్‌ టైటిల్ గెలిచి, తన కెరీర్‌లో మిగిలిన లోటును పూడ్చుకున్నారు సచిన్ టెండూల్కర్.
undefined
click me!