‘థ్యాంక్యూ అశ్విన్... మాకు కావాల్సింది ఇదే...’ భారత స్పిన్నర్ ట్వీట్‌పై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్...

First Published Mar 22, 2021, 4:59 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టి, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన రవిచంద్రన్ అశ్విన్, ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్‌ తరుపున ఆడనున్న అశ్విన్‌ వేసిన ఓ ట్వీట్‌పై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అలెగ్జాండ్రా హార్ట్‌లే స్పందించింది...

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సఫారీ మహిళల జట్టు ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే... దీంతో సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది దక్షిణాఫ్రికా మహిళల జట్టు...
undefined
ఆదివారం జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా వీక్షించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్... దక్షిణాఫ్రికా జట్టును గెలిపించిన లౌరాను ప్రశంసిస్తూ, సూర్యకుమార్ యాదవ్ అవుటైన విధానానికి లింకు చేస్తూ ట్వీట్ చేశాడు...
undefined
‘లౌరాను ఎలా అవుట్ చేయాలబ్బా... ఆమెకు సాఫ్ట్ సిగ్నల్ పంపిస్తే బెటర్ ఏమో’ అంటూ ట్వీట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ఈ ‘సాఫ్ట్ సిగ్నల్’ కారణంగా వివాదాస్పదకర రీతిలో అవుటైన విషయం తెలిసిందే...
undefined
మహిళల క్రికెట్ గురించి ట్వీట్ వేసిన రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ అలెగ్జాండ్రా హార్ట్‌లే...
undefined
‘ఇది... ఇది మేం చూడాలని అనుకుంటున్నది... ఇది మాకు కావాల్సింది... ఇది మాకు సర్వస్వం... మహిళల ఆట మీద నిజమైన, సరైన ఆసక్తి... రవిచంద్రన్ అశ్విన్ థ్యాంక్యూ... నిన్ను చూసి చాలామంది ఫాలో అవుతారు’ అంటూ కామెంట్ చేసింది అలెగ్జాండ్రా హార్ట్‌లే...
undefined
రెండో టీ20లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 158 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో చేధించింది సౌతాఫ్రికా జట్టు. లౌరా వాల్వారెట్ 39 బంతుల్లో 7 ఫోర్లు బాది 53 పరుగులు చేసి సౌతాఫ్రికాను గెలిపించింది...
undefined
కొన్నాళ్ల క్రితం టీమిండియా చేతుల్లో ఓడిన ఇంగ్లాండ్ పురుషుల జట్టును విమర్శిస్తూ ట్వీట్ చేసింది అలెగ్జాండ్రా హార్ట్‌లే... ‘మేం మొదలెట్టకముందే మీరు ముగించేశారు... వెల్‌డన్ బాయ్స్’ అంటూ వెటకారంగా అలెగ్జాండ్రా వేసిన ట్వీట్‌పై ఇంగ్లాండ్ ప్లేయర్లు జాసన్ రాయ్, రోరీ బర్న్స్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
undefined
సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే అలెగ్జాండ్రా హార్ట్‌లే... ఐపీఎల్ 2020 సమయంలో ‘ఆర్‌సీబీ, ఐపీఎల్ టైటిల్ గెలవడం మేం చేస్తామా’ అని ఓ మహిళా క్రికెటర్ వేసిన ట్వీట్‌కి ‘డెఫినట్‌లీ నాట్’ అంటూ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను పోస్టు చేసింది...
undefined
click me!