శ్రేయాస్ అయ్యర్‌‌కి షాక్... ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్‌ 2లో కూడా అతనికే కెప్టెన్సీ...

First Published Aug 31, 2021, 9:51 AM IST

కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలే, కెరీర్‌ను మలుపు తిప్పేస్తూ ఉంటాయి. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పడ్డాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, గాయం నుంచి కోలుకున్న అతని పొజిషన్ మాత్రం పూర్తిగా మారిపోయింది...

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 1లో అయ్యర్ పాల్గొనలేకపోయాడు...

అన్నీ మామూలుగా ఉండి ఉంటే శ్రీలంక‌లో పర్యటించిన భారత జట్టుకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించి ఉండేవాడు. అయితే అప్పటికి అయ్యర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో లక్కీ ఛాన్స్ మిస్ అయ్యాడు...

శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతని స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి జట్టులో తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు..

ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు టీ20, వన్డేల్లో నాలుగో స్థానం కోసం శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ మధ్య పోటీనెలకొంది...

అయ్యర్‌తో పోలిస్తే దూకుడుగా ఆడుతూ, ఎంతో కాన్ఫిడెంట్‌గా ఇన్నింగ్స్ నిర్మించే యాదవ్‌కే మొదటి ప్రాధాన్యం లభించేచ్చు... అంటే గాయం కారణంగా భారత జట్టులో తన స్థానం దాదాపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు శ్రేయాస్ అయ్యర్.

ఐపీఎల్ 2021 సీజన్ ఆడకపోయినా ఫేజ్ 2లో ఆడబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్సీ విషయంలో సమస్య వచ్చింది...

శ్రేయాస్ అయ్యర్ లేని జట్టును అద్భుతంగా నడిపించాడు రిషబ్ పంత్. మొదటి ఫేజ్‌లో 8 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి టాప్‌లో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్...

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో గత మూడు సీజన్లలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. 2020 సీజన్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌ కూడా చేరింది...

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మాత్రం శ్రేయాస్ అయ్యర్ కోలుకున్నా, రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది...

‘శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని భావించాం. అతను తిరిగి ఫామ్‌ అందుకోవడానికి మెంటల్ ఫిట్‌నెస్ కూడా అవసరం. అందుకే కెప్టెన్సీ ప్రెషర్, అయ్యర్‌పై పడకుండా పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని అనుకుంటున్నాం...’ అంటూ తెలిపారు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం...

చాలా ఏళ్ల తర్వాత నాలుగో స్థానంలో సరైన ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుని, కుదురుకుంటూ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ జీవితాన్ని ఈ గాయం మలుపు తిప్పిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

అయ్యర్ మాత్రం స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.. ‘నేను నూటికి నూరుశాతం ఫిట్‌గా ఉన్నా. ఐపీఎల్ కోసం బాగా ప్రాక్టీస్ చేస్తున్నా... తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం దొరికే ప్రతీ అవకాశాన్ని కరెక్టుగా వాడుకోవడమే నా ప్రధానలక్ష్యం’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...

click me!