ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ కూడా జడ్డూలాగే, అతన్ని జట్టు నుంచి తప్పించాలి... షేన్ వార్న్ కామెంట్...

భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి... ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు, ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కూడా ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ గురించి ఇదే కామెంట్స్ చేశాడు...

Shane Warne Calls Sam Curran as Bits and Pieces Player in Test, should be replace with

2018 ఇంగ్లాండ్‌ టూర్‌లో భారత జట్టును తెగ ఇబ్బంది పెట్టిన క్రికెటర్ ఎవ్వరంటే... సామ్ కుర్రాన్ పేరే ముందుగా వినిపిస్తుంది. మూడేళ్ల క్రితం భారత జట్టును బాల్‌తోనూ, బ్యాటుతోనూ ఇబ్బంది పెట్టాడు సామ్ కుర్రాన్..

Shane Warne Calls Sam Curran as Bits and Pieces Player in Test, should be replace with

2018 టూర్‌లో తొలి టెస్టులో 4 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్, రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. ఆ తర్వాత మూడో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన కుర్రాన్, తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులతో ఇంగ్లాండ్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. 


ఆ టూర్‌లో అద్భుతంగా రాణించి బ్యాటుతో 272 పరుగులు, 11 వికెట్లు పడగొట్టిన సామ్ కుర్రాన్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకుని, ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగాడు...

స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆఖరి వన్డేలో 95 పరుగులు చేసిన సామ్ కుర్రాన్... అద్భుతం పోరాటం చూపించాడు. అయితే ప్రస్తుతం అతని ఫామ్‌ ఏ మాత్రం సరిగా లేదు...

లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్ అయిన సామ్ కుర్రాన్, బాల్‌తోనూ పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... మూడు టెస్టుల్లో 74 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, కేవలం 3 వికెట్లు తీశాడు...

‘సామ్ కుర్రాన్ టెస్టులకు కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఇప్పటిదాకా అతను ఓ సెంచరీ చేయలేకపోయాడు. ఒక్క టెస్టులోనూ ఐదు వికెట్ల ప్రదర్శన ఇవ్వలేకపోయాడు...

జట్టులో అతని ప్లేస్ ఏంటో అర్థం కావడం లేదు. సామ్ కుర్రాన్ మంచి క్రికెటర్ కానీ టెస్టుల్లో మాత్రం అతను ఓ ‘బిట్స్ అండ్ పీసెస్’ ప్లేయర్...  అతని స్థానంలో వేరే ప్లేయర్‌ను ఆడిస్తే మంచిది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్.

‘డేవిడ్ మలాన్ చాలా అనుభవం ఉన్న ప్లేయర్. అన్నింటికంటే ముఖ్యంగా అతను పరుగుల దాహంతో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో రాణించాలనే కసి మలాన్‌లో చాలా ఉంది...

మూడో స్థానంలో డేవిడ్ మలాన్ కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యాడు. జాక్ క్రావ్లేని ఓపెనింగ్ పంపిస్తే బాగుంటుంది. అతనిలో చాలా టాలెంట్ ఉంది. కాబట్టి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి... ’ అంంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్.

Latest Videos

vuukle one pixel image
click me!