ఆస్ట్రేలియా టూర్‌లో భారత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఆ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చి, జట్టులో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు.
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ చేసిన 91 పరుగులు, గబ్బా టెస్టులో చారిత్రాత్మక విజయాన్ని అందిస్తూ చేసిన 89 పరుగులు... అతన్ని మ్యాచ్ విన్నర్‌గా మార్చేశాయి...
ఆ రెండు ఇన్నింగ్స్‌ల కారణంగానే టీ20, వన్డే జట్లలోకి కూడా రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బాగానే ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
అయితే ఇంగ్లాండ్ టూర్‌లో మాత్రం రిషబ్ పంత్ నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 87 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్...
కీలకమైన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన రిషబ్ పంత్ గురించి కొన్ని ఇంట్రెస్టింట్ కామెంట్లు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..
‘ఇంగ్లాండ్ పిచ్‌ల మీద బ్యాటింగ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్‌లు రిషబ్ పంత్ దగ్గర లేవు. ఆస్ట్రేలియా టూర్‌లో, భారత్ పిచ్‌ల్లోలా అతను ముందుకి వచ్చి, షాట్స్ ఆడాలని ప్రయత్నిస్తున్నాడు...
ఇలా ఆడితే ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు వస్తే రావచ్చు, అయితే సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే మాత్రం బ్యాటింగ్ విధానం మారాలి. కాస్త సహనాన్ని, ఓపిక చూపిస్తూ, డిఫెన్స్ మెరుగుపరుచుకోవాలి...
రిషబ్ పంత్ చాలా షాట్లు ఆడగలడు. అయితే అతని డిఫెన్స్ మాత్రం చాలా వీక్‌గా ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అతను ఇమడలేకపోతున్నాడు...
ఆస్ట్రేలియా, భారత్ పిచ్‌ల్లో రిషబ్ పంత్ సక్సెస్ కావడానికి కారణం, అక్కడి పిచ్‌లు స్వింగ్‌కి ఎక్కువగా సహకరించవు. స్వింగ్ పిచ్‌లపై ముందుకు వచ్చి, ఎదురుదాడికి దిగాలంటే కుదరదు...’ అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ భట్...
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. మూడు టెస్టులో కలిపి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడే పరుగులు చేశాడు...