ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీల్లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. రెండు సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది... 2022 సీజన్‌లో కేకేఆర్‌కి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, అతన్ని కెప్టెన్‌గా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది...
ఐపీఎల్ 2008 సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో లీగ్ ఆడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. దాదా కెప్టెన్సీలో 27 మ్యాచులు ఆడి, 13 మ్యాచుల్లో విజయాలు అందుకుంది..
412
మొట్టమొదటి సీజన్‌లో భారీ సెంచరీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన బ్రెండన్ మెక్‌కల్లమ్, 2009 సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు...
512
2009 సీజన్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కెప్టెన్సీలో 13 మ్యాచులు ఆడిన కేకేఆర్, 3 మ్యాచుల్లో గెలిచి, 9 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...
612
2011 నుంచి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్, రెండు సార్లు కేకేఆర్‌ని ఛాంపియన్‌గా నిలిపాడు...
712
2011 నుంచి 2017 వరకూ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 122 మ్యాచులు ఆడిన కేకేఆర్, 69 మ్యాచుల్లో గెలిచి 51 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...
812
గంభీర్ గాయపడిన మ్యాచుల్లో జాక్వస్ కలీస్ కెప్టెన్సీలో 2 మ్యాచులు ఆడింది కోల్‌కత్తా. రెండింట్లో ఓ విజయం, ఓ పరాజయం అందించాడు కలీస్...
912
గంభీర్ నుంచి 2018 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు దినేశ్ కార్తీక్. దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో 37 మ్యాచులు ఆడిన కేకేఆర్, 19 మ్యాచుల్లో గెలిచి 17 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...
1012
2020 సీజన్ మధ్యలో దినేశ్ కార్తీక్ నుంచి కేకేఆర్ కెప్టెన్సీ తీసుకున్నాడు ఇయాన్ మోర్గాన్. 2021 సీజన్‌లో మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
1112
ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో 24 మ్యాచులు ఆడిన కేకేఆర్, 11 మ్యాచుల్లో గెలిచి 12 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది...
1212
కెప్టెన్‌గా 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...