మయాంక్ అగర్వాల్‌ కాదు, ఆ భారత సీనియర్ క్రికెటర్‌కే పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ...

Published : Feb 16, 2022, 02:44 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో పూర్తి కొత్త జట్టుతో బరిలో దిగుతోంది పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ మెగా వేలానికి ముందు మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్ మినహా మిగిలిన ప్లేయర్లందరినీ వేలానికి వదిలేసింది ప్రీతి జింటా టీమ్...

PREV
112
మయాంక్ అగర్వాల్‌ కాదు, ఆ భారత సీనియర్ క్రికెటర్‌కే పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ...

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో మయాంక్ అగర్వాల్‌కి ఒక్కడికే అవకాశం ఇవ్వడంతో అతనికే కెప్టెన్సీ దక్కుతుందని భావించారు అభిమానులు...

212

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో కెఎల్ రాహుల్ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరినప్పుడు ఓ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్, 99 పరుగులు చేసి అందర్నీ మెప్పించాడు...

312

బ్యాటుతోనే కాకుండా ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పుల్లో కెఎల్ రాహుల్ కంటే మెరుగ్గా వ్యవహరించి, తనలోనూ కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని నిరూపించుకున్నాడు...

412

ఐపీఎల్ 2022 సీజన్ కోసం మయాంక్ అగర్వాల్‌ని రిటైన్ చేసుకోవడంతో అతనికే కెప్టెన్సీ దక్కవచ్చని భావించారు అభిమానులు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కెప్టెన్సీ అనుభవం ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేయలేదు పంజాబ్ కింగ్స్...

512

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌ స్టోన్‌ని రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, విండీస్ బౌలర్ ఓడియన్ స్మిత్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది...

612

అండర్ 19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ హీరో రాజ్ బవాను రూ.2 కోట్లకు, పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ సందీప్ శర్మను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, హర్‌ప్రీత్ బ్రార్‌ని రూ.3.8 కోట్లకు, షారుక్ ఖాన్‌ని రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది...

712

రాహుల్ చాహార్‌కి రూ.5.25 కోట్లు, జానీ బెయిర్ స్టో కోసం రూ.6.75 కోట్లు, కగిసో రబాడాని రూ.9.25 కోట్లు, శిఖర్ ధావన్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది...

812

ఐపీఎల్ 2022 సీజన్‌ దళాన్ని చూపించే ఫోటోలో శిఖర్ ధావన్‌ను మధ్యలో ముందు నిలబెట్టిన పంజాబ్ కింగ్స్, మయాంక్ అగర్వాల్, కగిసో రబాడా వంటి ప్లేయర్లను గబ్బర్‌కి సపోర్ట్‌గా ఉంచింది...

912

ఈ ఫోటోను బట్టి చూస్తుంటే ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా గబ్బర్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

1012

శిఖర్ ధావన్‌కి శ్రీలంక టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. కాబట్టి మయాంక్ అగర్వాల్ స్థానంలో గబ్బర్‌కి కెప్టెన్సీ ఇవ్వాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు నెటిజన్లు...

1112

ఇప్పటికే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కి అత్యధికంగా 12 మంది కెప్టెన్లు మారారు. ఈసారి గబ్బర్ కెప్టెన్సీ నచ్చకపోతే, సీజన్ మధ్యలో కెప్టెన్సీ మయాంక్ అగర్వాల్‌కి ఇవ్వొచ్చు...

1212

గత సీజన్ కంటే పటిష్టంగా మెరుగైన టీమ్‌గా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స., 2014 తర్వాత కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయిన ప్రీతి జింటా టీమ్, ఈసారి కనీసం ఆ లోటు అయినా తీర్చుకుంటుందో లేదో చూడాలి...

click me!

Recommended Stories