శ్రీలంక సిరీస్‌లో మార్పులు చేసిన బీసీసీఐ... విరాట్ కోహ్లీకి ఆ కాస్త సంతోషం కూడా మిగలకుండా ఉండేందుకు...

Published : Feb 15, 2022, 06:02 PM IST

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమవుతున్న భారత జట్టు, ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో కలిసి టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థనతో ఈ సిరీస్‌లో కొన్ని మార్పులు చేసింది భారత క్రికెట్ బోర్డు...

PREV
110
శ్రీలంక సిరీస్‌లో మార్పులు చేసిన బీసీసీఐ... విరాట్ కోహ్లీకి ఆ కాస్త సంతోషం కూడా మిగలకుండా ఉండేందుకు...

షెడ్యూల్ ప్రకారం శ్రీలంక, భారత్‌కి చేరుకున్న తర్వాత రెండు టెస్టులు ఆడి, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే తొలుత టీ20 సిరీస్ నిర్వహించాల్సిందిగా బీసీసీఐని కోరింది లంక క్రికెట్ బోర్డు...

210

లంక బోర్డు అభ్యర్థనను ఆమోదించిన భారత క్రికెట్ బోర్డు, లంక సిరీస్‌లో కొన్ని మార్పులు చేసింది. ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో లంక తొలుత టీ20 సిరీస్‌ ఆడి, టెస్టు సిరీస్ ఆడుతుంది...

310

ఫిబ్రవరి 4న లక్నోలో మొదటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత 26న రెండో టీ20, 27న మూడో టీ20 మ్యాచ్‌లు ధర్మశాల వేదికగా జరుగుతాయి...

410

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా తొలి టెస్టు ప్రారంభమవుతుంది. బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది...

510

బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే రెండో టెస్టును డే- నైట్ టెస్టుగా నిర్వహించబోతున్నట్టు అధికారికంగా ఖరారు చేసింది భారత క్రికెట్ బోర్డు...

610

ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఆడే విరాట్ కోహ్లీ, బెంగళూరు జనాలకు చేరువయ్యాడు. ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, వందో టెస్టు మ్యాచ్‌ బెంగళూరు వేదికగా జరుగుతుందని భావించారు అభిమానులు...

710

అయితే బీసీసీఐ మాత్రం తొలి టెస్టును మొహాలీ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురుకానుంది...

810

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తొలగించి, కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడానికి కూడా కారణమైన బీసీసీఐ, విరాట్‌కి అన్ని విధాలుగా చెక్ పెట్టేందుకు టెస్టు వేదికలను మార్చిందని అంటున్నారు అభిమానులు...

910

అయితే సిక్కు కుటుంబానికి చెందిన విరాట్ కోహ్లీ, ఢిల్లీలో పుట్టి పెరిగినా.. మొహాలీలో 100వ టెస్టు మ్యాచ్ ఆడడమంటే సొంత మైదానంలో ఆడినట్టే కదా అంటున్నారు మరికొందరు అభిమానులు... అదీ కాక మొహాలీలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది.

1010

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో కలిసి 26 పరుగులు మాత్రమే చేసి, తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories