సీఎస్‌కేలోకి శుబ్‌మన్ గిల్?... జడ్డూతో గుజరాత్ టైటాన్స్‌ ట్రేడింగ్! ట్వీట్లతో గందరగోళం...

First Published Sep 17, 2022, 6:39 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌‌ని ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభించి టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. ఆఖరి స్థానంలో నిలుస్తుందనుకున్న టీమ్ కాస్తా, అన్యూహ్యంగా మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలవడం ఇప్పటికీ చాలామందికి నమ్మశక్యంగా లేదు. దీనికి కారణం ఆ టీమ్ సెలక్షన్...

బిడ్డింగ్ తర్వాత టీమ్ పేరు పెట్టడానికి బాగా ఆలస్యం చేసిన గుజరాత్ టైటాన్స్, ప్లేయర్ల ఎంపిక విషయంలోనూ పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా లెక్కలు వేసిందేమీ లేదు. టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్ ఆడతాడని పేరున్న శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్... 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లో ఉన్నప్పుడు 120కి మించి స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేయడమే చాలా అరుదుగా అనిపించిన శుబ్‌మన్ గిల్, కొత్త టీమ్‌లోకి వచ్చిన తర్వాత కాస్త కొత్తగానే కనిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 34.5 సగటుతో 483 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్...

Image credit: PTI

గత మూడు సీజన్లలో ఎప్పుడూ 125+ స్ట్రైయిక్ రేటు దాటని శుబ్‌మన్ గిల్, ఈమారు 132.33 స్ట్రైయిక్ రేటుతో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి కొన్ని గేముల్లో మ్యాచ్ విన్నర్‌గా మారాడు...
 

అయితే శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ 2023కి టీమ్ మారబోతున్నాడా? స్వయంగా గుజరాత్ టైటాన్స్ వేసిన ఓ ట్వీట్ ఈ అనుమానం రేగడానికి కారణమైంది. 

Shubhman Gill

‘ఈ జర్నీ గుర్తుండిపోతుంది. నీ తర్వాత ప్రయాణానికి మేం విషెస్ తెలుపుతున్నాం’ అంటూ గిల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది గుజరాత్ టైటాన్స్. దీనికి ధన్యవాదాలు అనే స్టైల్‌లో ఓ ఎమోజీని జోడించి కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...
 

Shubman Gill

ఈ ట్వీట్ అలా పడిందో లేదో శుబ్‌మన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్తున్నాడని... లేదు లేదు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి వస్తున్నాడని అంచనాలు కడుతూ పోస్టులు చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

మరికొందరైతే చెన్నై సూపర్ కింగ్స్‌ని వీడుతున్న రవీంద్ర జడేజాతో శుబ్‌మన్ గిల్‌ని గుజరాత్ టైటాన్స్ ట్రేడింగ్ చేసుకుని ఉండొచ్చని... జడ్డూ టైటాన్స్ తరుపున, గిల్ సీఎస్‌కే తరుపున ఐపీఎల్ 2023 ఆడబోతున్నారని కథనాలు అల్లేశారు...

ఇలా ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో రచ్చ లేపిన గుజరాత్ టైటాన్స్, చివరికి క్లారిటీ ఇచ్చింది. ‘ట్విట్టర్ జనాలరా... గిల్ ఎప్పుడూ మాతోనే ఉంటాడు. దయచేసి ఇది మీరు అనుకుంటున్నది కాదని గుర్తించండి. అయితే మీ అంచనాలు మాకెంతో నచ్చాయి. ఇలాగే గెస్ చేస్తూ ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది గుజరాత్ టైటాన్స్...

శుబ్‌మన్ గిల్ ఎటు పోతున్నాడో ఏమో కానీ ఈ మధ్య ఇలాంటి దిక్కుమాలిన ఫ్రాంక్స్ ఎక్కువైపోయాయని మరికొందరు ఐపీఎల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

click me!