షాకింగ్: జడేజాకి గాయం అలా అయ్యిందా... స్కై బోర్డు మీద నుంచి కిందపడి, వరల్డ్‌కప్‌కి దూరం!

First Published Sep 9, 2022, 7:42 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది భారత జట్టు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్‌తో పాటు తొలి రెండు మ్యాచుల్లో ఆడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... గాయపడి టోర్నీ మధ్యలోనే దూరం కావడం, టీమ్‌ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. అయితే జడ్డూ ఎలా గాయపడ్డాడు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా, బ్యాటింగ్‌లో 35 పరుగులు చేసి విరాట్ కోహ్లీతో కలసి సంయుక్తంగా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాని జడ్డూ, బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు...

Ravindra Jadeja

హంగ్ కాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్‌ని రనౌట్ చేసిన రవీంద్ర జడేజా,  కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నదీ లేదు. మరి జడేజాకి ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకునేంత పెద్ద గాయం ఎలా అయ్యింది. బీసీసీఐకి కూడా ఇదే అనుమానం వచ్చింది. అయితే తాజా విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయట.

Image credit: PTI

దుబాయ్‌లో టీమిండియా బస చేస్తున్న హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో ఓ వాటర్ బేస్డ్ యాక్టివిటీలో పాల్గొనాల్సిందిగా రవీంద్ర జడేజాకి సూచించిందట భారత క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్. ఈ అడ్వెంచర్ యాక్టివిటీలో భాగంగా జడేజా ఓ స్కై బోర్డుపై బ్యాలెన్స్ చేస్తూ నిలబడాల్సి ఉంటుంది...

అయితే ఈ యాక్టివిటీ చేస్తున్న సమయంలో జారిపడిన రవీంద్ర జడేజా మోకాలికి తీవ్ర గాయం కావడం, అది అతను జట్టుకి దూరం కావడానికి కారణమైందని సమాచారం. అయితే ఆటగాళ్లకు బీసీసీఐ సూచించిన ట్రైయినింగ్ ప్రాసెస్‌లో ఇలాంటి అడ్వెంచర్స్ ఏమీ లేకపోవడం కొసమెరుపు...

Ravindra Jadeja

‘టీ20 వరల్డ్ కప్‌ ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో ఆటలు ఆడాల్సిన అవసరం లేదు. అసలు రిస్కీ స్కైబోర్డు యాక్టివిటీ చేయాల్సిందిగా ప్లేయర్లకు ఎవరు చెప్పారు. జడేజా గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి, టీ20 వరల్డ్ కప్‌కీ దూరమైనా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి ఎందుకని కోపం రాలేదు...

Ravindra Jadeja

రవీంద్ర జడేజాకి గాయం కావడానికి భారత కోచింగ్ సిబ్బంది చూపించిన అత్యుత్యాహం, అనవసర ప్రయోగాలే కారణమా... అనే విషయాలపై త్వరలో విచారణ చేస్తాం...’ అని ఓ బీసీసీఐ అధికారి, ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌కి తెలిపారు...

Ravindra Jadeja

పాకిస్తాన్‌తో, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో రావాల్సినన్ని పరుగులు రాలేదు. పాక్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, లంకతో మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీలు చేసినా జట్టు స్కోరు 200+ దాటించలేకపోయారు...

హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించలేకపోవడం టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది. రవీంద్ర జడేజా ఉండి ఉంటే మరో 20+ పరుగులైనా వచ్చి ఉండేవని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

click me!