కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లకు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడ‌బోయే భారత జట్టు ఇదే !

First Published | Dec 4, 2024, 5:14 PM IST

Champions Trophy 2025: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహించాలనే విష‌యంపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు కానీ, ఈ టోర్నీ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ప్రారంభించాయి.
 

Indian Team

Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 - టీమిండియా 

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో మూడో టైటిల్ కోసం చూస్తున్న  భారత క్రికెట్ జట్టుతో పాటు అన్ని క్రికెట్ దేశాలు త‌మ స‌న్నాహాలు ప్రారంభించాయి. ప్రపంచ కప్ 2023 తర్వాత భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు, కాబట్టి జట్టు మునుపటిలానే ఉండవచ్చని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కొంత మంది స్టార్ ప్లేయ‌ర్లు ఈ టోర్నీలో భార‌త్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అవ‌కాశాలు కోల్పోవ‌చ్చు.

Indian Team

ఛాంపియన్స్ ట్రోఫీ 2025- భార‌త జ‌ట్టు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ

రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టుకు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. అతను టీ20 ప్రపంచ కప్‌ను అందించాడు. అలాగే, వ‌న్డే ప్రపంచ కప్ 2023లో భార‌త‌ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అతనితో పాటు సీనియర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులో తప్పకుండా ఉంటాడు. ప్రస్తుతం ఫామ్ ను అందుకున్న కోహ్లీ అదే ఆటతీరును కొనసాగించాలని లక్ష్యంగా చేసుకున్నాడు. 


Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025

రోహిత్ శ‌ర్మ‌తో పాటు జ‌ట్టులోకి కొత్త ప్లేయ‌ర్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. తమ అద్భుత‌మైన ఆట‌తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా వంటి ఎందరో కొత్త ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకోవచ్చు.

కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చు 

భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, మ‌రో బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రపంచ కప్‌లో భారతదేశం కోసం చాలా బలమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే దీని తర్వాత అయ్యర్ భార‌త వ‌న్డే జ‌ట్టు నుంచి ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ విష‌యానికి వ‌స్తే కొత్త ప్లేయ‌ర్ల నుంచి బ‌ల‌మైన పోటీని ఎదుర్కొంటున్నాడు. కొత్త ప్లేయ‌ర్ల‌తో పాటు రిష‌బ్ పంత్ కూడా ఉంటాడు కాబ‌ట్టి కేఎల్ రాహుల్ కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చు అని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

Mohammed Shami-Jasprit Bumrah

మహ్మద్ షమీ తిరిగి వ‌స్తాడా? మహ్మద్ షమీ మళ్లీ భార‌త వన్డే జట్టులోకి రావచ్చు. ష‌మీ వ‌న్డే ప్రపంచ కప్ 2023 నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, జట్టు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వగలదు. భార‌త జ‌ట్టులో అత‌ను ప్ర‌ధాన పేస్ బౌల‌ర్ కావ‌చ్చు. గత వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత తరఫున అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న షమీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో మళ్లీ భారత జట్టు తరఫున గ్రౌండ్ లోకి అడుగుపెట్టే అవకాశముంది. అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉండనున్నాడు. వీరిద్దరూ భారత బౌలింగ్ విభాగాన్ని తమ భూజాలపై మోయనున్నారు.

Virat Kohli, RohitSharma

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జ‌ట్టు అంచ‌నాలు ఇలా ఉన్నాయి.. 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, హర్షిత్ రానా, మహ్మద్ సిరాజ్.

Latest Videos

click me!