వాటిని తప్పించుకోవడానికి అక్తర్ ఇంజక్షన్లు తీసుకున్నాడు.. కానీ ఇప్పుడు..: అఫ్రిది షాకింగ్ కామెంట్స్

Published : Feb 24, 2023, 02:58 PM IST

PSL 2023: పాకిస్తాన్ మాజీ సారథి, స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తన సహచర ఆటగాడు షోయభ్ అక్తర్ పై  సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ కు ఆడేప్పుడు అక్తర్ ఎక్కువగా ఇంజక్షన్లను వాడేవాడని అన్నాడు. 

PREV
17
వాటిని తప్పించుకోవడానికి అక్తర్ ఇంజక్షన్లు తీసుకున్నాడు.. కానీ ఇప్పుడు..:  అఫ్రిది షాకింగ్ కామెంట్స్

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయభ్ అక్తర్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గంటకు 150 ప్లస్ కిలోమీటర్ల  వేగంతో బంతులు విసిరే అక్తర్.. వన్డేలలో ఇప్పటికీ అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన బౌలర్ గా ఉన్నాడు.  దిగ్గజ బౌలర్లు ఎంతమంది వచ్చినా అక్తర్ వేగాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నారు.  

27

అయితే  అక్తర్ గురించి తాజాగా  పాకిస్తాన్ మాజీ సారథి, స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది సంచలన విషయాలు వెల్లడించాడు.  అక్తర్ తన గాయాల నుంచి విముక్తి పొందడానికి  విరివిగా ఇంజక్షన్లను ఉపయోగించేవాడని,  దాని వల్ల అతడు ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. 

37

పాకిస్తాన్ కు చెందిన సునో టీవీ లో జరిగిన ఓ చర్చలో భాగంగా  అఫ్రిది ఈ విషయాలను వెల్లడించాడు. గతేడాది  టీ20 ప్రపంచకప్  ఫైనల్ లో పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది  గాయపడటంతో అతడు మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ ను వీడాల్సి వచ్చింది. షాహీన్ ప్లేస్ లో తాను ఉంటే మాత్రం కచ్చితంగా ఇంజక్షన్స్ తీసుకోనైనా  తిరిగి మ్యాచ్ ఆడేవాడనని  అఫ్రిది అన్నాడు. 

47

అఫ్రిది మాట్లాడుతూ.. ‘మెల్‌బోర్న్ లో షాహీన్ ప్లేస్ లో నేనుంటే కచ్చితంగా ఇంజక్షన్స్ తీసుకోనైనా  మ్యాచ్ ఆడేవాడిని.  షోయభ్ అక్తర్ తన కెరీర్ లో చాలా ఇంజక్షన్లు తీసుకున్నాడు.  గాయాల  బాధను తట్టుకోవడానికి అతడు ఈ పని చేసేవాడు. చాలా పెయిన్ కిల్లర్స్ వాడాడు. కానీ ఇప్పుడు అక్తర్ నడవలేని స్థితిలో ఉన్నాడు. 

57

కానీ అక్తర్  వంటి బౌలర్ మళ్లీ రాడు.   గాయాల నుంచి తప్పించుకునే క్రమంలో భవిష్యత్ లో అనారోగ్యాల బారీన పడతానని తెలిసి కూడా అక్తర్ రిస్క్ చేశాడు. అందరూ అక్తర్ లు కాలేరు.  సరే.. అక్తర్ ను వదిలేయండి.. అతడు లెజెండ్..’అని  చెప్పుకొచ్చాడు. 

67

కాగా షాహీన్ గతేడాది శ్రీలంక పర్యటనలో ఉండగా  గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడు ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ తో పాటు స్వదేశంలో జరిగిన పలు మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ టీ20 ప్రపంచకప్ కల్లా తిరిగి ఫిట్నెస్ సాధించాడు. అయితే ఫైనల్ లో ఫీల్డింగ్ చేస్తూ మళ్లీ గాయపడ్డాడు.  

77

ఇటీవలే షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకున్న షాహీన్.. ప్రస్తుతం  పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడుతున్నాడు.  అతడే సారథిగా ఉన్న లాహోర్ ఖలాండర్స్ ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగింది. ప్రస్తుత సీజన్ లో లాహోర్.. మూడో స్థానంలో ఉంది. ముల్తాన్, ఇస్లామాబాద్ లు లాహోర్ కంటే ముందున్నాయి. 

click me!

Recommended Stories