అతను ఆస్ట్రేలియాలోనే చుక్కలు చూపించాడు! ఇది అతని అడ్డా... అశ్విన్‌పై ఇయాన్ చాపెల్...

Published : Feb 22, 2023, 05:15 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో స్టార్ పర్ఫామర్లుగా మారారు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా.  మొదటి రెండు టెస్టుల్లో రవీంద్ర జడేజా 17 వికెట్లు తీస్తే, రవిచంద్రన్ అశ్విన్ 14 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరూ కలిసి 2 టెస్టుల్లో 31 వికెట్లు తీస్తే మిగిలిన 9 వికెట్లలో మహ్మద్ షమీ 7, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు...

PREV
16
అతను ఆస్ట్రేలియాలోనే చుక్కలు చూపించాడు! ఇది అతని అడ్డా... అశ్విన్‌పై ఇయాన్ చాపెల్...
Image credit: Getty

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ రాణించి 156 పరుగులు చేశారు. భారత పిచ్‌లపై అదరగొడుతున్న రవిచంద్రన్ అశ్విన్, ప్రస్తుతం టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌లో ఉన్న జేమ్స్ అండర్సన్‌కి, అశ్విన్‌‌కి తేడా 2 పాయింట్లు మాత్రమే...

26

‘నిజం చెప్పాలంటే పిచ్ కంటే కూడా భారత జట్టు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని ఒప్పుకోవాలి. ఇండియాలో ఏం చేస్తే వికెట్లు పడతాయో వాళ్లకి బాగా తెలుసు. అశ్విన్ ఓ అద్భుతమైన బౌలర్..
 

36
R Ashwin

అతను ఎక్కడ బౌలింగ్ చేసినా వికెట్లు తీయగలడు. ఆస్ట్రేలియాలో కూడా అతను బాగా బౌలింగ్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియాలో ఆసీస్ టాపార్డర్‌కు ముచ్చెమటలు పట్టించాడు.. అలాంటి వాడికి ఇండియాలో ఎలా బౌలింగ్ చేయాలో తెలీదా... ఇది అతని అడ్డా...

46
Image credit: PTI

అశ్విన్ చాలా స్మార్ట్ బౌలర్. తన చేతులను ఎలా తిప్పాలో, ఎప్పుడు తిప్పాలో బాగా తెలుసుకున్నాడు. జడేజా కూడా అదరగొడుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు అశ్విన్ బౌలింగ్‌లో ఆడడానికి తెగ ప్రాక్టీస్ చేసి, జడేజాని లైట్ తీసుకున్నారు. అందుకే జడేజా మరింత సక్సెస్ అవుతున్నాడు...

56
Image credit: PTI

రవీంద్ర జడేజా స్కిల్స్ భారత పిచ్‌లకు కరెక్టుగా సెట్ అవుతాయి. ఏ మ్యాచ్ గెలవడానికైనా భాగస్వామ్యాలు చాలా అవసరం. బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లో కూడా. ఇప్పుడు అశ్విన్- జడేజా బౌలింగ్‌లో తీస్తున్న వికెట్లే.. టీమిండియాకి ఆధిక్యం దక్కడానికి కారణం..

66
Image credit: PTI

అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని అనుకునేలోపు, రవీంద్ర జడేజా ఏడు వికెట్లు తీశాడు. ఇలాగే కొనసాగితే ఆస్ట్రేలియా బ్యాటర్లు, ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే సిరీస్ అయిపోతుంది.. నాథన్ లియాన్, అశ్విన్ కాదు. అతను తనలా బౌలింగ్ చేస్తే చాలు..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్..
 

click me!

Recommended Stories