KL Rahul: లక్నో సారథిని ఆపకుంటే ఆర్సీబీ కొంప కొల్లేరే.. రాహుల్ కు బెంగళూరు అంటే పూనకమే..

Published : May 25, 2022, 02:40 PM IST

IPL 2022 LSG vs RCB: ఐపీఎల్ లో కొంత మంది ఆటగాళ్లు పలు జట్ల మీద దుమ్ము రేపుతుంటారు. ఇతర జట్ల మీద ఎలా ఆడినా ప్రత్యేకించి ఒక టీమ్ మీద మాత్రం పగబట్టినోళ్లలా ఆడతారు. ఆ కోవలోకి వచ్చేవాళ్లలో లక్నో సారథి ఒకడు.

PREV
18
KL Rahul: లక్నో సారథిని ఆపకుంటే ఆర్సీబీ కొంప కొల్లేరే.. రాహుల్ కు బెంగళూరు అంటే  పూనకమే..

ఐపీఎల్-15 లో  బుధవారం రాత్రి కోల్కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నడుమ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. 

28

లక్నో బ్యాటర్లలో ఓపెనర్లు క్వింటన్ డికాక్, కెఎల్ రాహుల్ చాలా కీలకం.  ఈ ఇద్దరూ ఆ జట్టు బ్యాటింగ్ కు పెద్దదిక్కు. లక్నో ఆడిన గత మ్యాచ్ (కేకేఆర్ తో) లో వీళ్లిద్దరూ కలిసి  20 ఓవర్లు  బ్యాటింగ్ చేసి 200 కు పైగా పరుగులు చేయడం గమనార్హం. 

38

అయితే  బెంగళూరు అంటేనే లక్నో సారథి కెఎల్ రాహుల్ శివాలెత్తుతాడు.  ఆ జట్టు పై బ్యాటింగ్ చేయడమంటే రాహుల్ కు పూనకం వచ్చినట్టే ఆడతాడు. తనకెంతో ఇష్టమైన ముంబై ఇండియన్స్ తో పాటు ఆర్సీబీ  పై కూడా రాహుల్  ఎప్పుడు బరిలోకి దిగినా వీరవిహారంతో చెలరేగుతాడు. 

48

ఆర్సీబీతో  రాహుల్ ఇప్పటివరకు 12 మ్యాచులాడాడు. ఇందులో ఏకంగా 531 పరుగులు ఉన్నాయంటే అతడు ఆర్సీబీపై ఎంత కసిగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు. 

58

12 మ్యాచుల్లో 91 సగటుతో 149.5 స్ట్రైక్ రేట్ తో ఆడిన రాహుల్.. ఐపీఎల్ లో తన  అత్యధిక స్కోరు (132) కూడా  ఆ జట్టు మీదే నమోదు చేశాడు.  ఈ సీజన్ లో కూడా ఇప్పటికే  జోరుమీదున్న రాహుల్.. ఇదే ప్రదర్శనను  కొనసాగించాలని చూస్తున్నాడు. 

68

ఆర్సీబీ ప్రధాన బౌలర్లుగా ఉన్న హెజిల్వుడ్,  మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ల 70 బంతులు ఎదుర్కున్న రాహుల్.. ఏకంగా 125 పరుగులు సాధించాడు. ఈ ముగ్గురు నేటి మ్యాచ్ లో బాధితులవుతారో లేక త్వరగా ఔట్ చేసి పంపిస్తారో చూడాలి. 

78

ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ కు అర్హత సాధిస్తుంది. దీంతో రాహుల్ తప్పకుండా ఎక్కువ సేపు   క్రీజులో ఉండాలనే ప్లాన్ తో బ్యాటింగ్ చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలే. 15 ఓవర్ల కంటే ఎక్కువ సేపు రాహుల్ క్రీజులో ఉంటే బెంగళూరు  ముందు భారీ లక్ష్యం తప్పదు. 

88

ఇక ఈ సీజన్ లో రాహుల్.. 14 మ్యాచులలో 537 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జోస్ బట్లర్ (718) తర్వాత నిలిచాడు. రాహుల్ ఈ సీజన్ లో రెండు సెంచరీలు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

click me!

Recommended Stories