మాతో ఆడాలంటే జాగ్రత్తగా టీమ్‌ని సెలక్ట్ చేయండి, మళ్లీ అలా ఓడిపోతే... షోయబ్ అక్తర్ కండకావరం...

Published : Jun 04, 2022, 01:42 PM IST

100 సార్లు గెలిచిన వాడు, ఒక్కసారి ఓడిపోవడం వాడికి ఎంత పెద్ద విషయమో, పది సార్లు ఓడిన వాడు, ఒక్కసారి గెలిస్తే అది వాడికి అంతటి చరిత్రే. అది అదృష్టవశాత్తు ఏదో ఫ్లోలో వచ్చేసిన విజయమైనా వాడికి అది ఆకాశాన్ని అందుకున్నంత సంబరమే అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది...

PREV
18
మాతో ఆడాలంటే జాగ్రత్తగా టీమ్‌ని సెలక్ట్ చేయండి, మళ్లీ అలా ఓడిపోతే... షోయబ్ అక్తర్ కండకావరం...

భారత జట్టు చేతుల్లో ఐసీసీ టోర్నీల్లో చిత్తుగా ఓడుతూ వచ్చిన పాకిస్తాన్ జట్టు, లక్ కలిసి వచ్చి... భారత జట్టును బ్యాడ్ లక్ వెంటాడి... టీ20 వరల్డ్ కప్ 2021లో తొలిసారి గెలిచింది...

28

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడం... విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పోరాడినా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి తొలి వికెట్‌కి 153 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్‌కి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు...

38

అంతకుముందు టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు చేతుల్లో ఐదు సార్లు ఓడింది పాకిస్తాన్ జట్టు. 2012లో 8 వికెట్ల తేడాతో 2014లో 7 వికెట్ల తేడాతో, 2016లో 6 వికెట్ల తేడాతో పాక్‌ని చిత్తు చేసింది టీమిండియా.. అయితే గత విజయంతో ఆ పరాజయాలన్నింటినీ మరిచిపోయినట్టుంది పాకిస్తాన్...

48

‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి అలాంటి ఇలాంటి టీమ్‌ని ఎంపిక చేస్తే సరిపోదు. టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్టర్లు కలిసి చాలా జాగ్రత్తగా టీమ్‌ని ఎంపిక చేసి, సాలిడ్ టమ్‌ని పంపండి...

58

ఎందుకంటే ఈసారి కూడా మాకు ఈజీ వాకోవర్ కాకూడదు కదా... బలమైన జట్టును ఓడిస్తే, పాకిస్తాన్‌ని ఓడించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండు జట్లూ చాలా భిన్నంగా ఉన్నాయి...

68

కాబట్టి ఈసారి ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం. మెల్‌బోర్న్ పిచ్‌ బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంది. కాబట్టి తొలుత బ్యాటింగ్ చేసి, ఛేదనలో టీమిండియాను ఆలౌట్ చేయడం పాకిస్తాన్‌కి తేలికవుతుంది...

78

స్టేడియంలో 1 లక్ష మంది ప్రేక్షకులు ఉంటే, వారిలో 70 వేల మంది టీమిండియాకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రెషర్‌ పాకిస్తాన్‌పై ఉంటుంది. అయితే అంత మంది ప్రేక్షకుల మధ్య ఓడిపోతామేమో అనే భయం కూడా భారత జట్టు ఆటను దెబ్బ తీయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

88

భారత జట్టు చేతుల్లో పాకిస్తాన్ 7 సార్లు వన్డే వరల్డ్ కప్‌లో, ఐదు సార్లు టీ20 వరల్డ్ కప్‌లో చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని మరిచిపోయి..  ఇంత కండకావరం చూపించడం కరెక్ట్ కాదని అంటున్నారు టీమిండియా అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories