హార్ధిక్ బౌలింగ్ వేస్తున్నాడు, మంచిదే... కానీ! టీమిండియా ఆల్‌రౌండర్‌పై అజారుద్దీన్ అనుమానం...

Published : Jun 04, 2022, 12:37 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా తనపై ఉన్న అనుమానాలన్నీంటికీ క్లారిటీ ఇచ్చేసి, టీమిండియాలోకి ఘనమైన రీఎంట్రీ ఇచ్చాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియా ఫ్యూచర్ ఆల్‌రౌండర్ అవ్వాలని కలలు కన్న వెంకటేశ్ అయ్యర్‌కి తర్వాతి సీజన్‌లోనే చెక్ పెట్టేశాడు హార్ధిక్ పాండ్యా...

PREV
18
హార్ధిక్ బౌలింగ్ వేస్తున్నాడు, మంచిదే... కానీ! టీమిండియా ఆల్‌రౌండర్‌పై అజారుద్దీన్ అనుమానం...
venkatesh Iyer, Hardik Pandya

వెంకటేశ్ అయ్యర్‌కి మాత్రమే కాకుండా గుజరాత్ టైటాన్స్‌కి ఫస్ట్ సీజన్‌లోనే టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యా... టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లకు కూడా పోటీ వచ్చేశాడు..

28

ఇప్పటిదాకా రెండు, మూడేసి సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కంటే ఫస్ట్ సీజన్‌లోనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ దక్కడం సబబు అని మాజీలు కూడా అభిప్రాయపడ్డారు...

38

ఐపీఎల్ 2020, 21 సీజన్లలో వెన్ను గాయంతో బాధపడుతూ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేక, ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన హార్ధిక్ పాండ్యా... ఈ సీజన్‌లో చాలా మ్యాచుల్లో పూర్తి ఓవర్లు బౌలింగ్ చేసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

48

‘హార్ధిక్ పాండ్యా, టీమిండియా కోరుకునే పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. అయితే గాయాల కారణంగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పాండ్యా కమ్‌బ్యాక్ ఇవ్వడం సంతోషంగా ఉంది...

58

ఈ సీజన్‌లో అతను చాలా మ్యాచుల్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే ఎంత కాలం అతను పూర్తి కోటా బౌలింగ్ చేయగలడు... మళ్లీ బౌలింగ్ చేయలేకపోతే మాత్రం పాండ్యా, తుదిజట్టులో చోటు దక్కించుకోలేడు...

68
Image credit: PTI

ఎందుకంటే బౌలింగ్ చేయలేకపోతే హార్ధిక్ పాండ్యా కేవలం హిట్టర్‌గా మాత్రమే మారతాడు. ఆ పొజిషన్ కోసం చాలా మంది లైన్‌లో ఉన్నారు... ఐపీఎల్ ఫైనల్‌లో పాండ్యా బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు...

78

నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 34 పరుగులు చేశాడు. టీమిండియాకి కావాల్సింది ఇదే. వికెట్లు తీస్తూ, పరుగులు చేయగల ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసమే వెతుకుతోంది.

88

బౌలింగ్ చేసినంత కాలం ఆ ప్లేస్‌కి హార్ధిక్ పాండ్యానే కరెక్ట్...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్...

click me!

Recommended Stories