ఒకరిద్దరు కాదు, ఏకంగా 8 మంది... టీ20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ కాని భారత క్రికెటర్లు వీరే....

Published : Sep 13, 2022, 04:24 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి 15 మందితో జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ కెప్టెన్సీలో, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ టీమ్‌లో కొత్త ముఖాలేమీ లేవు. సంచలన మార్పులు కూడా కనిపించలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఏడుగురు ప్లేయర్ల పేర్లు లేకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది...

PREV
18
ఒకరిద్దరు కాదు, ఏకంగా 8 మంది... టీ20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ కాని భారత క్రికెటర్లు వీరే....

శిఖర్ ధావన్: భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన పర్పామెన్స్ ఇచ్చే ధావన్, తన కెరీర్‌లో 66 టీ20 మ్యాచులు ఆడి 1719 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. గత ఏడాది లంకలో పర్యటించిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్‌ను పూర్తిగా పొట్టి ఫార్మాట్‌కి దూరం పెట్టేసింది బీసీసీఐ. ఐపీఎల్‌లో కోహ్లీ తర్వాత 6 వేల పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా ఉన్నప్పటికీ శిఖర్ ధావన్ స్ట్రైయిక్ రేటు సరిగా లేదని, అతన్ని టీ20లకు దూరం పెట్టినట్టు చెబుతోంది బీసీసీఐ...

28
Sanju Samson

సంజూ శాంసన్: రిషబ్ పంత్ టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నా సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు టీమిండియా ఆడిన మ్యాచుల్లోనూ రిషబ్ పంత్ కంటే మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు సంజూ శాంసన్. అయితే రిషబ్ పంత్‌కి మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ, సంజూకి అన్యాయం చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో తేడా రిజల్ట్ కొడితే, సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వనందుకు మరింత తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది బీసీసీఐ...

38
Image credit: PTI

ఇషాన్ కిషన్:ఈ ఏడాది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 6లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన ఇషాన్ కిషన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు... ఈ ఏడాది టీ20ల్లో 350+ పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరంగా పెట్టింది బీసీసీఐ. కెఎల్ రాహుల్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, విరాట్ కోహ్లీలు రోహిత్‌తో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండడంతో ఇషాన్ కిషన్‌కి టీమ్‌లో చోటు కరువైంది...

48

ఉమ్రాన్ మాలిక్: ఐపీఎల్‌లో 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి, క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాడు ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి దూసుకొచ్చిన ఉమ్రాన్ మాలిక్‌ని రోహిత్ సేన సరిగ్గా వాడుకోలేకపోయింది. ఇచ్చామన్నట్టుగా మూడు మ్యాచుల్లో 9 ఓవర్లు బౌలింగ్ చేయించిన రోహిత్ సేన, ఆ తర్వాత అతన్ని పక్కనబెట్టేసింది. బౌన్సీ పిచ్‌లకు వేదికైన ఆస్ట్రేలియాలో ఉమ్రాన్ మాలిక్ ఉండి ఉంటే... భారత జట్టుకి అదనపు బలం చేకూరేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

58
Image credit: PTI

ఆవేశ్ ఖాన్:ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి వచ్చిన యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్. ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్షల్ పటేల్ (32) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా (28 వికెట్లు) ఉన్న ఆవేశ్ ఖాన్, టీమిండియాలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. బుమ్రా, హర్షల్ గాయపడడంతో లక్కీగా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడిన ఆవేశ్ ఖాన్, తొలి రెండు మ్యాచుల్లో భారీగా పరుగులు సమర్పించి... జట్టులో స్థానం కోల్పోయాడు. 

68
Rahul Tripathi

రాహుల్ త్రిపాఠి: ఐపీఎల్‌లో మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీల్లో నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్ 2022లో 413 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్ సిరీస్‌లకు ఎంపిక చేసింది టీమిండియా. అయితే అతనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండానే టీమ్‌ నుంచి తప్పించింది బీసీసీఐ. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో దాదాపు 1800 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, టాపార్డర్‌లో, మిడిల్ ఆర్డర్‌లో భారత జట్టుకి బాగా ఉపయోగపడేవాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... 

78

శుబ్‌మన్ గిల్: ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టెస్టుల్లో చోటు దక్కించుకున్న ప్లేయర్ శుబ్‌మన్ గిల్. 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన శుబ్‌మన్ గిల్,ఈ ఏడాది వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. వన్డేల్లో 72 సగటుతో పరుగులు చేసిన గిల్, ఐపీఎల్ 2022లో చక్కని పర్ఫామెన్స్ చూపించి గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...
 

88

రుతురాజ్ గైక్వాడ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, ఇప్పటిదాకా 8 టీ20 మ్యాచులు ఆడి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. రుతురాజ్ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో ఐర్లాండ్ సిరీస్ తర్వాత అతన్ని పక్కనబెట్టేశారు సెలక్టర్లు..

click me!

Recommended Stories