సఫారీ సిరీస్‌కు సారథిగా గబ్బర్.. టీ20 ప్రపంచకప్ సభ్యులందరికీ రెస్ట్

Published : Sep 12, 2022, 09:17 AM IST

INDIA vs SOUTH AFRICA: త్వరలో భారత పర్యటనకు రానున్న   దక్షిణాఫ్రికా భారత్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ సారథి కాగా వన్డేలకు మాత్రం.. 

PREV
16
సఫారీ సిరీస్‌కు సారథిగా  గబ్బర్..  టీ20 ప్రపంచకప్ సభ్యులందరికీ రెస్ట్

ఈ ఏడాది జూన్ లో ఇదివరకే భారత పర్యటనకు వచ్చిన  దక్షిణాఫ్రికా.. తాజాగా మళ్లీ రెండోసారి కూడా  రాబోతున్నది.  ఈ నెల ఆఖర్లో భారత పర్యటనకు వచ్చే  దక్షిణాఫ్రికా.. భారత్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.  ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది.  

26
Image credit: Getty

అయితే టీ20 ప్రపంచకప్ కు ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఈ సిరీస్ కు  భారత సెలక్టర్లు  ముందస్తు  ప్రణాళికలు సిద్ధం చేశారు. టీ20 జట్టుకు రోహిత్ శర్మనే సారథిగా వ్యవహరించినా వన్డే సిరీసీ కు మాత్రం శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉండనున్నాడు.

36

ఈ మేరకు సెలక్టర్లు కూడా జట్టును ఎంపిక చేసే పనిలో పడ్డారు. రోహిత్ తో పాటు టీ20 ప్రపంచకప్ కు వెళ్లబోయే పలువురు క్రికెటర్లకు ఈ సిరీస్ లో రెస్ట్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.  వారిలో రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ కూడా  విరామం తీసుకునే ఛాన్స్ ఉంది. 

46

దక్షిణాఫ్రికా కంటే  ముందు భారత్.. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడుతుంది. సెప్టెంబర్ 20, 23, 25 వ తేదీలలో ఈమ్యాచులు జరుగుతాయి.  ఈ సిరీస్ కు రోహిత్ శర్మనే సారథిగా వ్యవహరించనున్నాడు.

56

ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా.. భారత పర్యటనకు రానుంది.ఈ సిరీస్ లో భాగంగా సఫారీలు భారత్ తో మొదలు  మూడు టీ20లుఆడతారు.  సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, అక్టోబర్4న మూడుటీ20లు జరుగుతాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా.. అక్టోబర్  6, 9, 11 తేదీలలో మూడు వన్డేలను ఆడనుంది.   

66

కాగా టీ20 సిరీస్ కు రోహిత్ శర్మనే సారథిగా  వ్యవహరించనుండగా.. వన్డేలకు మాత్రం  శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న టీమిండియా.. అదే నెల 9 లేదా 10న  మెల్బోర్న్ విమానం ఎక్కనుంది. దీంతో వన్డే సిరీస్ కు  వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ ల మాదిరిగా రెండో శ్రేణి జట్టును ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బోర్డు వర్గాల టాక్. ఇక ఈ సిరీస్ కు ద్రావిడ్ కాకుండా వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కు హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 
 

click me!

Recommended Stories