Asia Cup: ఆసియా కప్ మాదే.. బల్లగుద్ది చెబుతున్న పాకిస్తాన్ కెప్టెన్

Published : Sep 11, 2022, 06:26 PM IST

Asia Cup 2022: మూడు వారాలుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఆసియా కప్ తుదిఅంకానికి చేరుకున్నది. నేడు దుబాయ్ వేదికగా  ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. 

PREV
16
Asia Cup: ఆసియా కప్ మాదే.. బల్లగుద్ది చెబుతున్న పాకిస్తాన్ కెప్టెన్

మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే ఆసియా కప్ ఫైనల్లో తమదే విజయమని పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ తెలిపాడు. ప్రతి కెప్టెన్, జట్టుకు ట్రోఫీ గెలవాలని కలలు కంటాడని,అయితే తాము వాటిని నిజం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

26

ఆసియా కప్-2022 ఫైనల్ ప్రారంభానికి కొద్దిగంటల ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన ట్విటర్ ఖాతా ద్వారా   ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మేరకు బాబర్ ఆజమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

36

బాబర్ మాట్లాడుతూ... ‘ప్రతి కెప్టెన్, జట్టు  ట్రోఫీని గెలవాలని కలలు కంటారు.  జట్టుగా మా లక్ష్యం  మంచి ప్రదర్శన ఇచ్చి  ట్రోఫీ నెగ్గడమే. ఒకసారి  ఈ  మెగా టోర్నీలో వెనక్కి తిరిగి తీసుకుంటే మేము చాలా మంచి ప్రదర్శనలిచ్చాం. 

46

అంతేగాక కొన్ని చెత్త మ్యాచ్ లూ ఆడాం. మా జట్టు తరఫున పలువురు  ఆటగాళ్లు మంచి  పెర్ఫార్మెన్స్ చేశారు. అందుకుగాను  కొంతమంది  ప్లేయర్ ఆఫ్  ది మ్యాచ్ లకూ ఎంపికయ్యారు. 
 

56

ఒక జట్టును నిర్మించేప్పుడు పలువురు ఆటగాళ్లు మాకు అండగా నిలబడటం.. మ్యాచ్ లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం గొప్ప విషయం. కెప్టెన్ గా ఇది నాకుచాలా ముఖ్యం. జట్టు భవిష్యత్ విజయాలకు మార్గం సుగమం చేస్తుంది..’అని అన్నాడు. 

66

ఇదిలాఉండగా నేటి మ్యాచ్ కు ముందు ముగిసిన సూపర్ -4 లో  పాకిస్తాన్ ను శ్రీలంక చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో  సాధించిన విజయంతో శ్రీలంక.. ఫైనల్ లో కూడా  గెలవాలని ఆశిస్తున్నది. మరి నేటిమ్యాచ్ లో  ఎవరువిజయం సాధిస్తారో కొద్దిగంటల్లో తేలనుంది. 

click me!

Recommended Stories