ఫీల్డింగ్ చేసిన కుక్కకి అవార్డు ప్రకటించిన ఐసీసీ... బాగా హర్ట్ అయిన జార్వో ఫ్యాన్స్...

First Published Sep 13, 2021, 4:23 PM IST

ప్రతీ నెలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మకంగా ప్రకటించే అవార్డుల్లో ఈ సారి ఓ పెంపుడు కుక్క కూడా చోటు దక్కించుకుంది. అవును... ఐర్లాండ్ టీ20 వుమెన్స్ మ్యాచ్‌లో ఆటకు కాసేపు అంతరాయం కలిగించినా, క్రికట్ వరల్డ్‌లో హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న డజెల్ అనే పెంపుడు కుక్కకు స్పెషల్ అవార్డు ప్రకటించింది ఐసీసీ...

Cricket Dog

ఆటకు అంతరాయం కలిగించినా, పర్ఫెక్ట్‌గా బంతికి అందుకుని, క్రీజులో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన డజెల్‌ని ‘ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్’గా ప్రకటించింది. అంతేకాకుండా ఐర్లాంగ్ క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌గానూ అభివర్ణించింది...  

బ్రెడీ క్రికెట్ క్లబ్, ఐర్లాండ్ క్రికెట్ క్లబ్‌కు చెందిన సివిల్ సర్వీస్ నార్త్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిందీ సంఘటన.  బ్యాట్‌వుమన్ బాదిన బంతిని అందుకుని, రనౌట్ చేసేందుకు ప్రయత్నించింది వికెట్ కీపర్. అయితే ఆ బంతిని అందుకున్న ఓ పెంపుడు కుక్క బంతిని ఫీల్డర్లకు చిక్కకుండా పరుగులు పెట్టింది.

దీంతో దాన్ని పట్టుకునేందుకు గ్రౌండ్ సిబ్బందితో పాటు ఫీల్డర్లు కూడా పరుగులు తీశఆరు.. ఫీల్డర్ కంటే ముందే బంతిని నోట కరుచుకుని కొద్దిసేపు గ్రౌండ్‌లో పరుగులు పెట్టించిన ఆ క్యూట్ డాగ్,.. చివరికి బ్యాట్‌వుమన్ దగ్గరకు వెళ్లి బాల్ అందించింది. 

ఈ వీడియోను స్వయంగా ఐర్లాండ్ విమెన్స్ క్రికెట్ ట్విట్టర్ అధికారిక ఖాతా పోస్టు చేయడంతో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఈ పెంపుడు కుక్కకి అవార్డు ప్రకటించింది ఐసీసీ... భారత మహిళా క్రికెటర్ జమీమా రోడ్రిగ్స్ కూడా ఈ కుక్క, తన ఫెవరెట్ ఫీల్డర్ అంటూ కామెంట్ చేసింది... 

Jarvo 69

అయితే కుక్కకి బెస్ట్ ఫీల్డర్‌గా అవార్డు ఇవ్వడంతో జార్వో ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. ఒక్కసారి వచ్చి ఆటను ఆపిన కుక్కకి అవార్డు ఇస్తే... మూడు సార్లు వచ్చి భారత్, ఇంగ్లాండ్ మధ్య డిస్టర్బ్ చేసిన జార్వోకి కూడా అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు..

click me!