టెండూల్కర్ కాదు, అతనే అసలైన క్రికెట్ గాడ్... బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షాకింగ్ కామెంట్స్...

First Published Sep 14, 2021, 9:45 AM IST

క్రికెట్ వరల్డ్‌లో సచిన్ టెండూల్కర్‌ తీసుకొచ్చిన మార్పులు అనితర సాధ్యం. అసాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, ‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడుతున్నాడు...

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసి, ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న సచిన్ టెండూల్కర్... అత్యధిక మ్యాచులతో అత్యధిక పరుగులు వంటి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు యావత్ భారతం స్థంభించిపోయేది. పనులన్నీ మానేసి టీవీలకు అతుక్కుపోయేది...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, సచిన్ టెండూల్కర్‌ని తొలిసారిగా ‘గాడ్ ఆఫ్ క్రికెట్‌’గా సంభోదించాడు. ‘నేను దేవుడిని చూశాను, అతను ఇండియాకి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు’ అని వ్యాఖ్యానించాడు మాథ్యూ హేడెన్...

ఈ వ్యాఖ్యల తర్వాత ‘క్రికెట్ గాడ్’, ‘గాడ్ ఆఫ్ క్రికెట్‌’గా ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి మరో నిక్‌నేమ్ జత అయిపోయింది...

అయితే తన దృష్టిలో మాత్రం సచిన్ టెండూల్కర్ కంటే ఎమ్మెస్ ధోనీని ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పిలిస్తే కరెక్ట్‌గా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి...

‘నా దృష్టిలో ఎమ్మెస్ ధోనీయే గాడ్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే ధోనీ, టీమిండియాకి రెండు వరల్డ్‌కప్స్ అందించాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ, జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ శెట్టి...

‘నా దృష్టిలో ఎమ్మెస్ ధోనీయే గాడ్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే ధోనీ, టీమిండియాకి రెండు వరల్డ్‌కప్స్ అందించాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ, జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ శెట్టి...

ఐపీఎల్ ద్వారా ఎమ్మెస్ ధోనీ మరింతగా జనాల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు... అయితే ‘క్రికెట్ గాడ్’గా పిలవడం మాత్రం చాలా ఓవర్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

సచిన్ టెండూల్కర్‌తో పోలిస్తే, ఎమ్మెస్ ధోనీ సాధించినవి అసాధ్యమైనవేమీ కాదు... ధోనీ కంటే మెరుగ్గా పరుగులు చేసిన వారు, వరల్డ్‌కప్ విజయాలు సాధించినవారూ ఉన్నారు...

వరల్డ్‌కప్స్ సాధించినందుకే ‘క్రికెట్ గాడ్’ అని పిలవాలంటే రెండు వన్డే వరల్డ్‌కప్స్‌ సాధించిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ని ఏమని పిలవాలని ప్రశ్నిస్తున్నారు టెండూల్కర్ అభిమానులు...

click me!