షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్... నాలుగో టెస్టుకి ఉమేశ్ యాదవ్... నటరాజన్‌కి ఛాన్స్?...

First Published Dec 30, 2020, 2:05 PM IST

తొలి టెస్టులో గాయపడి, టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి జట్టులో చోటు కల్పించింది టీమిండియా. రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. మూడో టెస్టు ఆడకపోయినా, నాలుగో టెస్టు సమయానికి ఉమేశ్ యాదవ్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది భారత జట్టు. షమీ, ఉమేశ్ యాదవ్ గాయపడడంతో టీ20, వన్డేల్లో రాణించిన నటరాజన్‌కి టెస్టుల్లో ఛాన్స్ వస్తుందని భావించినా... నట్టూ రాకపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు బీసీసీఐ.

ఐపీఎల్‌లో రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్... తొలుత టెస్టులకు నెట్‌ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు...
undefined
అయితే టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి... గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో నటరాజన్‌కి చోటు దక్కింది...
undefined
నవ్‌దీప్ సైనీ వన్డేల్లో ఘోరంగా విఫలం కావడంతో మూడో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్... మొదటి వన్డేలోనే రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు...
undefined
టీ20 జట్టుకి సెలక్ట్ అయినా ముందుగా వన్డే జట్టు నుంచి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్... టీ20ల్లోనూ సత్తా చాటాడు... సీనియర్ బౌలర్ల కంటే మెరుగ్గా బౌలింగ్ చేసి అదరగొట్టారు...
undefined
మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడడంతో నటరాజన్ టెస్టు ఎంట్రీ కూడా ఇస్తున్నాడని వార్తలు వచ్చాయి...
undefined
అయితే సీనియర్ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ని షమీ స్థానంలో ఎంపిక చేసిన టీమిండియా... ఉమేశ్ యాదవ్ స్థానంలో ఏ ప్లేయర్ జట్టులోకి వస్తాడనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు...
undefined
షమీ గాయంతో రెండో టెస్టు తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న మహ్మద్ సిరాజ్... ఆరంగ్రేటం టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తీసి అదరగొట్టాడు..
undefined
2018లో ఇంగ్లాండ్‌పై టెస్టు ఆరంగ్రేటం చేసిన శార్దూల్ ఠాకూర్... గాయం కారణంగా 10 బంతులు మాత్రమే వేసి టెస్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ అతనికి టెస్టులో అవకాశం దక్కింది.
undefined
click me!