చివరి రెండు టెస్టులను జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా... వార్నర్, పుకోవిస్కీ ఎంట్రీ...

First Published Dec 30, 2020, 1:00 PM IST

మొదటి టెస్టులో ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చి విజయాన్ని అందుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా, రెండో టెస్టులో టీమిండియా చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆట సాగిన నాలుగు రోజుల పాటు భారత జట్టే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా 50+ స్కోరు చేయలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరాజయంతో చివరి రెండు టెస్టు మ్యాచులకు జట్టులో మార్పులు చేసింది ఆస్ట్రేలియా. మూడో, నాలుగో టెస్టుకి టెస్టు జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

మెల్‌బోర్న్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయిన ఆసీస్ ఓపెనర్ జో బర్న్స్‌ను జట్టు నుంచి తప్పించింది ఆస్ట్రేలియా...
undefined
మొదటి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 8 పరుగులే అవుటైన జో బర్న్స్... రెండో ఇన్నింగ్స్‌లో అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ సిడ్నీలో అతనికి అవకాశం దక్కలేదు.
undefined
రెండో టెస్టులో గాయపడి, టీ20 సిరీస్, మొదటి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి జట్టులో స్థానం కల్పించింది ఆస్ట్రేలియా...
undefined
మొదట డేవిడ్ వార్నర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకొంత సమయం పడుతుందని, మూడో టెస్టులో కూడా అతను బరిలో దిగకపోవచ్చని వార్తలు వినిపించినా... రెండో టెస్టు పరాజయం తర్వాత వార్నర్ కమ్‌బ్యాక్ జట్టుకి అత్యవసరంగా మారిపోయింది.
undefined
ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన విల్ పుకోవిస్కీ కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి, సిడ్నీ టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు..
undefined
సిడ్నీ టెస్టులో వార్నర్, పుకోవిస్కీ కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది... పుకోవిస్కీ కోసం ట్రావిస్ హెడ్‌ను తప్పించే అవకాశం ఉంది...
undefined
మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్ రెండు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేదు. అయితే పుకోవిస్కీ రాకతో ఓపెనింగ్ చేసిన వన్డే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్... మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వస్తాడు..
undefined
దూకుడుగా బ్యాటింగ్ చేసిన మాథ్యూ వేడ్... భారీ స్కోరు చేయలేకపోయినా రెండు టెస్టుల్లోనూ రాణించాడు. హెడ్ మాత్రం మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 62 పరుగులే చేశాడు...
undefined
వీరితో పాటు గాయం కారణంగా టీ20 సిరీస్‌కి దూరమైన సీన్ అబ్బాట్‌కి కూడా జట్టులో చోటు కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
undefined
మరోవైపు భారత జట్టు నుంచి రోహిత్ శర్మ... సిడ్నీ టెస్టు నుంచి టీమిండియాలో రీఎంట్రీ ఇస్తున్నాడు...
undefined
సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, బుధవారం మెల్‌బోర్న్ చేరుకుని టీమిండియాతో కలిసాడు...
undefined
మయాంక్ అగర్వాల్ లేదా హనుమ విహారి స్థానంలో రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది...
undefined
ఒకవేళ రెండు టెస్టులకి రిజర్వు బెంచుకే పరిమితమైన కెఎల్ రాహుల్‌ని కూడా ఆడించాలని టీమిండియా భావిస్తే హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ ఇద్దరికీ సిడ్నీ టెస్టులో చోటు ఉండదు.
undefined
click me!